Advertisementt

కరోనా బారిన ఇషా చావ్లా

Mon 10th Jan 2022 09:22 AM
isha chawla,isha chawla covid,poolarangadu,mr groom,jump jilani,divya drusti  కరోనా బారిన ఇషా చావ్లా
Isha Chawla with corona కరోనా బారిన ఇషా చావ్లా
Advertisement
Ads by CJ

ప్రేమ కావాలి చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె శ్రీమన్నారాయణ చిత్రంలో నటించింది. అలాగే పూలరంగడు, Mr పెళ్ళికొడుకు, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక, వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న దివ్య దృష్టి సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇషా చావ్లా అందరూ కూడా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రజలు, సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. అలాగే త్వరలో కరోనా నుండి బయటపడి నేను చేయబోయే తెలుగు సినిమా షూటింగ్ లలో పాల్గొంటానని తెలియజేశారు.

Isha Chawla with corona:

Isha Chawla with covid

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ