కృష్ణ గారు సూపర్ స్టార్ గా వున్నప్పుడే రమేష్ ని సినిమా ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేసారు. మొట్ట మొదట దాసరి గారు నీడ అనే సినిమా ద్వారా, రమేష్ ని పరిచయం చేసారు. అప్పటికి రమేష్ ఇంకా టెన్త్ లో వున్నాడు. తరువాత రమేష్ పెద్దవాడు అయ్యాక కృష్ణ గారు రమేష్ కి ట్రైనింగ్ ఇప్పించి చాలా గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చెయ్యాలని అనుకుని, సామ్రాట్ అనే సినిమా చేసారు. వి మధుసూధనా రావు దీనికి దర్శకుడు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన హిందీ సినిమా బేతాబ్ అనే సినిమాకి రీమేక్. ఈ సినిమా టైటిల్ అప్పట్లో చాలా వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ కూడా తన సినిమా కి సామ్రాట్ అని పెట్టుకోవటం, తరువాత కృష్ణగారు కోర్ట్ ని ఆశ్రయించటం సామ్రాట్ అనే టైటిల్ కృష్ణ గారికే చెందాలి అని కోర్ట్ తీర్పు ఇవ్వటం పెద్ద వివాదం అయింది.
బాలకృష్ణ తన సినిమాకి సాహస సామ్రాట్ అని పేరు మార్చుకోవాల్సి వచ్చింది. రమేష్ బాబు సామ్రాట్ 1987 లో రిలీజ్ అయింది. ఆ తరువాత ఏ కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ అనే సినిమా రమేష్ కి పెద్ద సక్సెస్ ని ఇచ్చింది. అదే అతని కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్. తరువాత దాసరి నారాయణ రావు, వి మధుసూధనా రావు, జంధ్యాల, కె మురళి మోహన్ రావు, ఎస్ ఎస్ రవిచంద్ర లాంటి దర్శకులతో పని చేసినా, నటుడుగా ఎక్కువ కాలం నిలదొక్కుకో లేక పోయాడు. కృష్ణ గారు ఎప్పుడూ రమేష్ గురించే ఎక్కువ తపన పడేవారు నటుడిగా నిలబెట్టాలి అని. కానీ కాలం కలిసి రాలేదు రమేష్ కి.