అల్లు అర్జున్ సినిమా పుష్ప రిలీజ్ అయినపుడు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ మీద ఒత్తిడి తెచ్చి సినిమా రిలీజ్ చేసారని అందరూ విమర్శించారు. ఎందుకంటే ఆ సినిమా చాలాచోట్ల కరెక్ట్ టైం కి ప్రింట్స్ వెళ్ళలేదు, కొన్ని చోట్ల సౌండ్ సిస్టం సరిగ్గా పని చెయ్యలేదు. వీటన్నిటికీ అల్లు అర్జున్ కారణం అని, అతనే అందరి మీద ఒత్తిడి తెచ్చి ఆ సినిమా ని డిసెంబర్ పదిహేడు న రిలీజ్ చేయించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అల్లు అర్జున్ నిర్ణయం సరి అయినదని, అలా రిలీజ్ చెయ్యడం వల్లనే ఆ సినిమా సేవ్ అయిందని ఇప్పుడు అంటున్నారు.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ మరియు రాధే శ్యామ్ రెండూ కూడా సంక్రాంతి కి రిలీజ్ అవ్వాలి, కానీ పోస్టుపోన్ అయ్యాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలీదు. మరి అల్లు అర్జున్ సినిమా కూడా కొంచెం లేట్ గా రిలీజ్ అయి ఉంటే ఎంత నష్టం జరిగేదో కదా! పెద్ద బడ్జెట్ సినిమాలు కంప్లీట్ అయ్యాక, రిలీజ్ అవ్వకుండా ఉంటే, ఆ సినిమా నిర్మాతకి, దర్శకుడికి, అందులో నటించిన వాళ్ళకి కూడా టెన్షన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒకే ఒక్క యాక్టర్ టెన్షన్ లేకుండా వున్నారు, అదే అల్లు అర్జున్! సినిమా మంచి టైం కి రిలీజ్ అవ్వటమే కాదు, పెద్ద హిట్ కూడా అయింది. ఇప్పుడు పోస్ట్ పోనే అయినా ఆర్.ఆర్.ఆర్ హీరోలు, మేకర్స్ అదే టెంక్షన్ లో ఉన్నారు. ఆలా అన్న వాళ్ళే ఇప్పుడు అల్లు అర్జున్ నిర్ణయం అదిరింది అంటున్నారు.