Advertisement

అతిధి దేవో భవలో హీరో కేరెక్ట‌రైజేష‌న్ హైలైట్

Tue 04th Jan 2022 04:20 PM
director polimera nageshwar,director polimera nageshwar interve,arhidi devo bhava movie,arhidi devo bhava press meet  అతిధి దేవో భవలో హీరో కేరెక్ట‌రైజేష‌న్ హైలైట్
Director Polimera Nageshwar Interview అతిధి దేవో భవలో హీరో కేరెక్ట‌రైజేష‌న్ హైలైట్
Advertisement

అతిథిని చూస్తే దేవుడులా భావించే యువ‌కుడి క‌థ‌తో అతిధి దేవో భవ  చిత్రం రూపొందింద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ తెలియ‌జేస్తున్నారు. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాత‌లు. ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వర్ విలేక‌రుల‌తో చిత్రం గురించి ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

- మాది చోడ‌వ‌రం ద‌గ్గ‌ర బోగాపురం అనే మారుమూల గ్రామం. కాలేజీ రోజుల్లోనే సినిమాల‌పై ఆస‌క్తి ఎక్కువ‌. మ‌రోవైపు నాట‌కాల్లో కూడా ప్ర‌వేశం వుంది. బిటెక్ లో చేరినా సినిమా ఇంట్రెస్ట్ త‌గ్గ‌లేదు. అందుకే హైద‌రాబాద్ వ‌చ్చేశాను. మొద‌ట్లో వినాయ‌క్‌, కె.విశ్వ‌నాథ్‌, రాజ‌మౌళి వంటివారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది.

- నేను ప‌లు క‌థ‌లు రాసుకున్నాను. ద‌ర్శ‌కుడిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో రాజాబాబు మిర్యాల ప‌రిచ‌యం కావ‌డం దేవుడిలా అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. అలా మంచి టీమ్‌తో ఈ సినిమాకు ప‌నిచేశాను. తొలి సినిమానే సంక్రాంతికి విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుంది.

- ఇక క‌థ నిర్మాత‌దే అయినా ఎవ‌రి ప‌ని వారు చేయ‌గ‌లిగాం. నిర్మాత‌లు కొత్త‌వార‌యినా ద‌ర్శ‌కుడిగా నాకున్న అనుభ‌వంతో న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. ద‌ర్శ‌కుడిగా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో సినిమా బాగా వ‌చ్చింది.  గేరంటీగా మంచి సినిమా చేశాన‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.

- అతిధి దేవో భవ చిత్రం ల‌వ్‌, యాక్ష‌న్ .. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వుంటుంది.

- ట్రైల‌ర్‌లో భ‌యంమీద డైలాగ్ వుంది. అది ఏమిట‌నేది సినిమాలో చూడాల్సిందే.  హీరో ఎందుకు భ‌య‌ప‌డున్నాడ‌నేది సినిమాకు హైలైట్‌ పాయింట్‌.

- ఈ సినిమాలో నువేక్ష‌, రోహిణి, న‌వీన రెడ్డి వంటి న‌టీన‌టులు బాగా న‌టించారు. స‌ప్త‌గిరి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఇలా టీమ్ వ‌ర్క్‌తో ముందుకు సాగాం.

- ఇక సంగీత‌ప‌రంగా శేఖ‌ర్ చంద్ర బాణీలు ఆద‌ర‌ణ పొందింది. `బాగుంటుంది న‌వ్వితే.`. అనే పాట కాల‌ర్ ట్యూన్‌గా యూత్  పెట్టుకున్నారు. ఇప్ప‌టికి 4 మిలియ‌న్ల ప్ల‌స్ అయింది. ఇంకా మూడు సాంగ్‌లు హిట్ అయ్యాయి. ట్రైల‌ర్ ఆద‌ర‌ణ పొందింది.

- టైటిల్ ప‌రంగా చెప్పాలంటే ఇది క్లాస్ టైటిల్ అయినా.. అంద‌రికీ చేరుతుంది. క‌థ‌లో హీరోకు అంద‌రూ అతిథులే. అలా ఎందుకు అనుకుంటాడ‌నేది సినిమాలోనే చూడాల్సిందే.

- నిర్మాత‌లు అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించారు. మ‌ధ్య‌లో క‌రోనా అడ్డంకి అయినా అనుకున్న బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం.

- సినిమాకు వ‌చ్చి న‌ప్రేక్ష‌కుడు మంచి సినిమా చూశామ‌నే ఫీల్తో వుంటాడు.

- ఈ సినిమాను రాజ‌మౌళిగారికి చూపించే స‌మ‌య‌మంలేదు..ఎందుకంటే  జ‌న‌వ‌రి 26 మా సినిమా విడుద‌ల అనుకున్నాం. కానీ ప‌రిస్థితులు మారిపోవ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బిజీలో ఆయ‌న‌కు చూపించే వీలు కాలేదు. త‌ప్ప‌కుండా ఏదో టైంలో ఆయ‌న‌కు చూపిస్తాను.

- ఇప్ప‌టికే ప‌లు క‌థ‌లు రాసుకున్నాను. నాకు యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇష్టం. అని తెలిపారు.

Director Polimera Nageshwar Interview:

Director Polimera Nageshwar Interview about Arhidi Devo Bhava

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement