కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన ముద్రను సొంతం చేసుకున్న యస్ ఓరిజినల్స్ రాబోయే సంవత్సరంలో లో మరింత వేగం చూపించబోతుంది. ఏకంగా తొమ్మిది సినిమాలు రాబోయే సంవత్సరంలో యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి విడుదలకు సిద్దం అవుతున్నాయి. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నాయి. కాన్సెప్ట్ ని నమ్మి కొత్త తరం దర్శకులను పరిచయం చేస్తూ టాలీవుడ్ లో తన ముద్రను మరింత బలంగా వేయబోతుంది. ఇప్పటికే యస్ ఓరిజినల్స్ అంటే కొత్త తరం కథలకు కేరాఫ్ అడ్రస్ అనే మాట టాలీవుడ్ అంతటా వినపడుతుంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తమ సంస్థనుండి రాబోతున్న సినిమా విశేషాల పై నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూః
యస్ ఓరిజినల్స్ ను టాలీవుడ్ లో ప్రత్యేక స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకూ భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పడు యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండే వచ్చే యేడాది 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ దాదాపుగా ముగింపుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమాల ద్వారా కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. టాలెంట్ పై నమ్మకంతో వారిని ప్రోత్సహించడం జరిగింది.ఇవే కాకుండా మరికొన్ని కథలను ఫైనలైజ్ చేయడం జరిగింది వాటి ని వచ్చే యేడాది ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పడు విడుదలకు సిద్దం అవుతున్న సినిమాలు బ్రహ్మానందం గారు , కలర్స్ స్వాతి,
సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న పంచతంత్రం, యూత్ లో స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సంతోష్ శోభన్ హీరోగా, ఎమ్ ఆర్ ప్రొడక్షన్ తో డిజిటల్ మీడియా లో బ్రాండ్ గా ఎదిగిన సుభాష్ దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపోందించాము.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనులలో ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ తో సుమంత్ హీరోగా రూపొందుతన్న అహాం సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతుంది.
కొత్త దర్శకుడు బ్రిజేష్ దర్శకత్వంలో వైరల్, బ్రహ్మానందం గారి తనయుడు గౌతమ్ హీరో గా చేస్తున్న సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది ఈసినిమా తో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతం సినిమా తో విమర్శకుల ప్రశంసలు పొందిన కిరణ్ దర్శకత్వంలో అదే టీంతో మరో సినిమా రూపొందిస్తున్నాము. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వీటితో పాటు కన్నడంలో
బీర్బల్ ట్రియాలజీ తీసిన
దర్శకుడు శ్రీని దర్శకత్వంలో ఓల్డ్ మంక్ అనే సినిమా ని రూపొందిస్తున్నాము.
కొత్త దర్శకుడు విష్ణు దర్శత్వంలో మళయాళంలో రూపొందుతున్న నైనా లో 96 మూవీ ఫేమ్ గౌరి కిషన్ లీడ్ రోల్ చేస్తుంది.
మూవీ షూటింగ్ పూర్తయింది.
బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ లలో ఉంది.
2022 సంవత్సరం యస్ ఓరిజనల్స్ కి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. మా సంస్థనుండి తొమ్మది సినిమాలు రిలీజ్ అవుతాయి. కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం బలంగా ఉంది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో యస్ ఓరిజినల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది. అన్నారు.