ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి ప్రముఖ హీరో లు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువ దర్శకత్వం వహించారు. నా పిలుపే ప్రభంజనం, బడి పంతులు, ఉక్కు సంకెళ్లు, పగబట్టిన సింహం, మానవుడు దానవుడు, యమ దూతలు లాంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలియచేసారు.