Advertisementt

జనవరి14 నుండి రవితేజ రావణాసుర

Sun 02nd Jan 2022 04:28 PM
ravi teja,ravanasura,sudheer varma,raviteja - sudheer varma combo,ravanasura launch for january 14  జనవరి14 నుండి రవితేజ రావణాసుర
Ravi Teja Ravanasura opening forJanuary 14 జనవరి14 నుండి రవితేజ రావణాసుర
Advertisement
Ads by CJ

రవితేజ వరస సినిమాలతో జోరు మీదున్నారు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. తదుపరి చిత్రాలు షూటింగ్ లో ఆయన బిజీగా వున్నారు. ఇక రవితేజ , క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రావణాసురలో క‌థానాయ‌కుడు ప‌ది డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తుండ‌డం విశేషం.

రావణాసురలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు.

 రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నటీనటుల, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Ravi Teja Ravanasura opening forJanuary 14:

Ravi Teja Ravanasura launch for January 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ