Advertisementt

భోళా శంకర్ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ భోళా

Sat 01st Jan 2022 04:53 PM
swag of bholaa,pre look,megastar chiranjeevi,meher ramesh,anil sunkara,mega massive movie,bholaa shankar  భోళా శంకర్ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ భోళా
Swag Of Bholaa- Pre Look of Bholaa Shankar Is Out Now భోళా శంకర్ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ భోళా
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "భోళా శంకర్". ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Swag Of Bholaa- Pre Look of Bholaa Shankar Is Out Now:

Swag Of Bholaa- Pre Look Of Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara Mega Massive Movie Bholaa Shankar Is Out Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ