డిసెంబర్ 30న యురేకా సకా మికా రిలీజ్
Click Here:👉 Urekaa Saka Mika Movie Press meet
బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ బేనర్ లో సాకేత్ సాయిరాం దర్శకత్వంలో డాలీభట్ నిర్మించిన చిత్రం యురేకా సకా మికా. శ్రీధర్, అవంతి జంటగా నటించిన ఈ చిత్రానికి సాకేత్ సాయిరాం సంగీతం మరియు దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా కూడా చేశారు. మరో ముఖ్య పాత్రలో కావ్య సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని హంగామా, క్లిడ్ వాకర్, ఎయిర్ టెల్ ఏక్సట్రీమ్, సోనీ, టాటా స్కై, టి.సి.ఎల్, వీ.ఐ, నెట్ ప్లస్, జీ, వన్ ప్లస్, ఎంఐ, ఎల్ జి, అమెజాన్(us,uk) తదితర 20 ప్లాట్ ఫామ్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాకేత్ సాయి రామ్ మాట్లాడుతూ.. బేసిక్ గా నేను మ్యూజిక్ డైరెక్టర్ ని.. తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా ఇండస్ట్రీ కు పరిచయమయ్యాను. నేను మ్యూజిక్ దర్శకుడు గా చేసిన 1940 లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డు, మ్యూజిక్ కు స్టేట్ అవార్డు వచ్చింది. తరువాత సొంతూరు,హైస్కూల్ వంటి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 32 సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు రాకపోవడంతో దర్శకుడు అయ్యి మంచి సినిమాలు తీయాలనే కొరికతో దర్శకుడు అవ్వాలని నేను డైరెక్టర్ గా డెమో చేశాను. నా డెమో చూసిన నిర్మాత డాలీ బట్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి సినిమాకు అవకాశం ఇచ్చారు. తరువాత యురేకా సకా మికా చిత్రం సైకో పాథక్ థిల్లర్ కాదాంశం తో రూపొందింది. కథకు తగిన కామెడీ కూడా తోడు అవటం తో యురేకా సకా మికా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రం లో 5 పాటలు వున్నాయి. యురేకా సాక మికా హర్రర్ కావటంతో రీ-రికార్డింగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది. కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించి అతనిని ఎంతో టార్చెర్ చేసి దొంగతనం చేసి వెళ్లి పోతారు. ఆ తరువాత కృష్ణమూర్తి, క్రిష్ గా సైకోపాథిక్ గా మారి వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అన్నదే యురేకా సకా మికా చిత్ర కథాంశం అన్నారు.
Click Here:👉 Urekaa Saka Mika Movie Trailer 01
నిర్మాత డాలీభట్ మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత డాలీభట్ మాట్లాడుతూ..అనుకున్నదొక్కటి అయినదొక్కటి సినిమా తర్వాత నేను చేస్తున్న రెండవ సినిమా యురేకా సకా మికా.. తెలుగులో చాలా సినిమాలు వున్నా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇందులో హీరో,హీరోయిన్స్ లేరు క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి.. కావ్య సింగ్ ఇందులో చాలా చక్కగా నటించింది.ఇంకొక నటి. అవంతిక కూడా చాలా చక్కగా నటించింది. మా చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన ప్రవీణ్ రెడ్డి ఆ తరువాత కే.జి.యఫ్, కాలా, మహాసముద్రం, రొమాంటిక్ వంటి భారీ చిత్రాలకు పనిచేయటం, అలాగే మా చిత్రం లో నటించిన ఆర్టిస్టులు కూడా ఎంతో బిజీ గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఇందులోని పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ సినిమా చాలా మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఫ్రెష్ జానర్ తో వస్తున్న ఇలాంటి మూవీస్ కు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.ఈ నెల 30 న 20 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లలో హంగామా, క్లిడ్ వాకర్, ఎయిర్ టెల్ ఏక్సట్రీమ్, సోనీ, టాటా స్కై, టి.సి.ఎల్, వీ.ఐ, నెట్ ప్లస్, జీ, వన్ ప్లస్, ఎంఐ, ఎల్ జి, అమెజాన్(us,uk) తదితర 20 ప్లాట్ ఫామ్స్ లో యురేకా సకా మికా సినిమా డిసెంబర్ 30 నుండి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడైనా ఈ సినిమా చూడవచ్చు అన్నారు.
Click Here:👉 Urekaa Saka Mika Movie Treaser
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ రాజీవ్ మాట్లాడుతూ.. ఇది 20 ఫ్లాట్ ఫార్మ్ లలో .ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30 న స్ట్రీమింగ్ అవుతుంది.. మా ఈస్ట్ వెస్ట్ లో మేము రిలీజ్ చేస్తున్న 400 సినిమా.ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.ప్రతి 15 రోజులకు ఒక లాంగ్వేజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము. ఈ.చిత్ర దర్శక నిర్మాతల ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
Click Here:👉 Urekaa Saka Mika Movie Trailer 02
నటీనటులు: శ్రీధర్, అవంతి, సాకేత్ సాయిరాం, కావ్య సింగ్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, విరాజ్, రామ కృష్ణ, స్వాతి నాయుడు, గోయెల్ తదితరులు.
సాంకేతిక నిపుణులు: కథ- స్క్రీన్ ప్లే-సంగీతం- దర్శకత్వం: సాకేత్ సాయి రామ్, నిర్మాత: డాలీభట్, సినిమాటోగ్రాఫర్: రాము-ప్రవీణ్ రెడ్డి, ఎడిటర్: గోపి సిందం, కొరియోగ్రఫీ: రంజిత్, పాటలు: సాగర్ నారాయణ, వీరేంద్ర ఈమని, శ్రీ మురళి, షేక్ మీరా, సునీల్ వంచ, మాటలు: టి.ఆనంద్ కృష్ణ, శ్రీధర్.
Click Here:👉 Urekaa Saka Mika Movie Stills