దిల్ తో పాగల్ హై నూతన చిత్ర ప్రారంభోత్సవం
గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్ ఎమ్ ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పిస్తున్న చిత్రం దిల్ తో పాగల్ హై ఎస్ సోమరాజు నిర్మాతగా, సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నూతన చిత్రం పూజా కార్యక్రమాలను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించుకుంది.. శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రవి తేజ్, మిస్ మహారాష్ట్ర గా గెలుపొందిన అనిత షిండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాప్ ప్రసన్నకుమార్ కొట్టగా, కెమెరా స్విచ్ ఆన్ జైపాల్ రెడ్డి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ వినగానే సినిమా చేద్దామని నిర్మాత సోమరాజు గారు నిర్ణయించుకున్నారు.. ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా సక్సెస్ చేద్దాం సపోర్ట్ ఇచ్చారు.. రొటీన్ కథకు బిన్నంగా ఈ స్టోరీ ఉంటుంది.. జనవరి 15 తరువాత షూటింగ్ ప్రారంభించి మే లో సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు.
నిర్మాత సోమరాజు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి రీల్ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు మా దర్శకుడు సురేష్ అందుకు ఆయనకు నా ధన్యవాదాలు. దిల్ తో పాగల్ హై స్టోరీ నచ్చి సినిమా చేయడం జరిగింది. బడ్జెట్ ప్రాబ్లెమ్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం అనుకొని సినిమా చేయడం జరుగు తోంది. ఈ సినిమా తరువాత ప్రతి 6 నెలలకు ఒకసారి సినిమాలను తీయాలని నిర్ణయుంచుకున్నాం అన్నారు.
అతిథి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ పేర్లలోనే ఎస్ ఎస్ ఉంది.. సో అక్కడే వీరి సక్సెస్ కనపడుతోంది. దిల్ తో మొదలైన ఈ సినిమా దిల్ సినిమా, అలాగే టైటిల్ తో బ్లాక్ బస్టర్ అయిన సాంగ్ లా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని బావిస్తూ అందరికీ నా బెస్ట్ విషెస్ అన్నారు.
హీరో రవి తేజ్ మాట్లాడుతూ.. మొదటి సారి కథ వింటున్నప్పుడే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. అప్పుడే చెప్పా.. దర్శకుడికి నిర్మాతకు నా వంద శాతం పాత్రకు నా వంతు కృషి చేసి న్యాయం చేస్తా అని.. ప్రేమ ఖైదీ, ఉప్పెన సినిమాల్లా అందరికీ నచ్చే సినిమా అవుతుందని చెప్పారు.
హీరోయిన్ అనిత షిండే మాట్లాడుతూ.. ఈ సినిమా తో 2022 సంవత్సరం నాదే అవుతుందని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జైపాల్ రెడ్డి, రమణ రియల్టర్, మాస్టర్ చిక్కు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రవితేజ్, అనిత షిండే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డీఒపి: కె.బి, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఎడిటర్: శీను, డైలాగ్స్: కోడి ఎన్ పి, స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్: ఎస్ ఎస్ కె. (శ్రీరంగం సతీష్),
నిర్మాత: సోమేశ్ రాజు