Advertisementt

నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి బర్త్ డే రోజు 4 వ సినిమా ప్రారంభం

Sat 25th Dec 2021 06:12 PM
nagam tirupathi reddy,aadi sai kumar,kalyanji gogana,vision cinemas  నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి బర్త్ డే రోజు 4 వ సినిమా ప్రారంభం
Nagam Tirupathi Reddy Birthday Celebrations నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి బర్త్ డే రోజు 4 వ సినిమా ప్రారంభం
Advertisement
Ads by CJ

నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి బర్త్ డే సందర్భంగా విజ‌న్ సినిమాస్ ఆది సాయి కుమార్ ప్రొడక్షన్ నెంబర్ 4 ప్రారంభం 

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్‌ హీరోగా తెరకెక్కిన తీస్ మార్ ఖాన్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాటకం ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

అయితే నేడు (డిసెంబర్ 25) నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి పుట్టిన రోజు బర్త్ డే వేడుకను విజన్ సినిమాస్ ఆఫీసులో తీస్ మార్ ఖాన్ టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆది సాయి కుమార్, సునీల్‌లతో పాటు తీస్ మార్ ఖాన్ మూవీ యూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా విజ‌న్ సినిమాస్ నుంచి మరో మూవీ అనౌన్స్ చేశారు నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి. ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే కాన్ఫిడెన్స్‌తో అదే బ్యానర్ నుంచి మరో సినిమా అనౌన్స్ చేయడం విశేషం.

తీస్ మార్ ఖాన్ రషెస్, అవుట్‌పుట్ చూసిన నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ఆనందంతో తిరిగి అదే యూనిట్‌తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ లీడ్ రోల్ పోషించనుండగా కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించనున్నారు. 

ఈ సందర్భంగా నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే తీస్ మార్ ఖాన్ షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా రషెస్ చూశాక తీస్ మార్ ఖాన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. చిత్రంలోని సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి. ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నా తదుపరి సినిమాకు కూడా దర్శకుడు కళ్యాణ్ జి గోగణతో, ఆది సాయి కుమార్‌‌తో కలిసి పని చేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఇకపై ఆదితో ప్రతి ఏడాది ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తాను. ఈ విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం 4కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. 

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ముందుగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నా. నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణలతో తీస్ మార్ ఖాన్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌పై ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశాం. దర్శక నిర్మాతలు చాలా సపోర్ట్ చేస్తూ అవుట్‌‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం 4 రూపంలో మరోసారి అదే టీమ్‌తో కలిసి పని చేయనుండటం ఆనందంగా ఉంది అన్నారు.

దర్శకులు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ సినిమా సెట్స్‌పై ఆది సాయి కుమార్ తన నటనతో అబ్బురపరిచారు. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఎంతో సపోర్ట్ చేస్తూ ఖర్చు విషయంలో వెనకాడలేదు. ఈ సినిమాను చాలా బాగా తీర్చిదిద్దుతున్నాం. నాగం తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతున్నా. ముందు ముందు ఆయన మరిన్ని భారీ సినిమాల నిర్మాణంలో భాగం కావాలని కోరుకుంటున్నా. ప్రొడక్షన్ నెం 4తో మరో విలక్షణ కథను మీ ముందుంచుతాం అన్నారు.     

సునీల్ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం ఆది సాయి కుమార్ చాలా కష్టపడ్డారు. త్రి షేడ్స్‌లో ఆయన నటన లోని ఎలివేషన్స్ బయటపడతాయి. నిర్మాత నాగం తిరుపతి రెడ్డికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాగం తిరుపతి రెడ్డి గారు చాలా ప్రామిసింగ్ గా ఉంటారు. ఆయనను, ఆయన ఫ్యామిలీని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. తీస్ మార్ ఖాన్ కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుంటున్నా అన్నారు. 

సాంకేతిక నిపుణులు: బ్యానర్: విజన్ సినిమాస్, డైరెక్టర్: కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్: నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ళ, పీఆర్.ఒ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Nagam Tirupathi Reddy Birthday Celebrations:

Producer Nagam Tirupathi Reddy birthday 4th movie launch  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ