Advertisementt

సమంత యశోద ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Sat 25th Dec 2021 05:25 PM
samantha,sridevi movies,yashoda first schedule,yashoda movie,varalakshmi sarath kumar  సమంత యశోద ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Samantha Yashoda First Schedule wrapped up సమంత యశోద ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Advertisement
Ads by CJ

సమంత ప్రధాన పాత్రలో  రూపొందుతున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యిన సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. ఈ నెల 6న య‌శోద‌ చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్త‌యింది.

సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై  హైద‌రాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ప్ర‌ముఖ న‌టులు రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. దర్శకులు ఇద్దరూ కొత్తవాళ్లు అయినప్పటికీ... ఎక్స్ ట్రార్డిన‌రీగా, కాన్ఫిడెంట్‌గా తెర‌కెక్కిస్తున్నారు. కెమెరామెన్ సుకుమార్ కూడా అద్భుత‌మైన అవుట్‌పుట్‌ ఇస్తున్నారు. విజువ‌ల్‌గా, టెక్నిక‌ల్‌గా సినిమా చాలా గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్క‌డా రాజీ పడటం లేదు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు.

Samantha Yashoda First Schedule wrapped up:

Samantha next under Sridevi Movies, Yashoda First Schedule wrapped up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ