విభిన్న కంటెంట్‌లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రాబోతోంది. ఫ్యామిలీ డ్రామా, డార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ టీవీ ఇలా అన్ని రకాల జానర్లను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించబోతోంది.
ముంబై, డిసెంబర్ 24, 2021 : మన వినోద విశ్వంలో భాగంగా తెలుగు ప్రేక్షకులను అలరిచేందుకు వరుస అనౌన్స్ మెంట్ లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్దంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తెలుగు సినిమా ప్రముఖులు నాగార్జున, జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, శోభు యార్లగడ్డ, కృష్ణా విజయ్, బోయపాటి శ్రీను, క్రిష్, అజయ్, అంజలి కలిసి మున్ముందు రాబోతోన్న ప్రాపర్టీ లకు సంబంధించిన టైటిల్స్‌ను ప్రకటించబోతోన్నారు. తెలుగులో రాబోతోన్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ పరంపరతో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతన్నారు. నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ లైవ్ షో రాబోతోంది. క్రిష్ డైరెక్షన్‌లో తారక రత్న, అజయ్ కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ 9 అవర్స్ అనే చిత్రం రాబోతోంది. మహిళలు, చిన్నపిల్లల మీద జరిగే నేరాలపై ఝాన్సీ అనే సినిమా రాబోతోంది. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో సైతాన్ అనే హారర్ సినిమా రెడీగా ఉంది.
అన్ హర్డ్, మాస్ట్రో, అద్భుతం, మా ఊరి పొలిమేర, అనబెల్లె సేతుపతి వంటి చిత్రాలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జగపతి బాబు, శరత్ కుమార్ నటించిన "పరంపర" సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తోంది. అధికారం, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ ఉండబోతోంది. ఈ సిరీస్‌ను భారీ ఎత్తున నిర్మించారు. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించగా.. హరి యేలేటి కథను అందించారు. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించారు. ఇక రానున్న రోజుల్లో 9 అవర్స్, ఝాన్సీ వంటి ప్రాజెక్ట్‌లను కూడా తెలుగు ప్రేక్షకులు చూడనున్నారు.
నాగార్జున హోస్ట్‌గా వచ్చిన రియాల్టీ షో "బిగ్ బాస్" లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులోకి రాబోతోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సునీల్ రాయన్ మాట్లాడుతూ.. ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాం. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం. తెలుగు చిత్రసీమలోని అద్భుతమైన వ్యక్తులతో కలిసి ఎన్నో ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తున్నాం. పరంరప, 9 అవర్స్, ఝాన్సీ, బిగ్ బాస్ లైవ్ వంటి వాటిని ఇండియా వ్యాప్తంగా చూపించబోతోన్నామని అన్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్, హెచ్ఎస్ఎమ్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, స్టార్ అండ్ డిస్నీ ఇండియా ప్రెసిడెంట్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. వారి వారి భాషల్లోని సినీ ప్రేమికులకు గొప్ప కంటెంట్ ఇవ్వాలని మేం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మేం తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సిరీస్‌ను చూపించబోతోన్నాం. జగపతి బాబు, శరత్ కుమార్ వంటి ప్రతిభావంతులైన నటీనటులతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నాం అని అన్నారు.
డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వినోద రంగంలో ఇండియా స్థానం మెరుగుపడింది. ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో మన తెలుగు ఇండస్ట్రీ అసోసియేట్ అవ్వడంతో ఆనందించదగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు తమ అభిమాన నటీనటులను ఇంకాస్త కొత్త పాత్రల్లో చూడబోతోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు తెలుగులోని ప్రతిభావంతులైన నటీనటులను, కథలను చూసేందుకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థతో తెలుగులోని స్టార్స్ మరింత వెలిగిపోతారని ఆశిస్తున్నాను. దీనికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. టాలీవుడ్‌లోనూ ఇప్పుడు ఎన్నో ఒరిజినల్ ప్రొడక్షన్స్, క్రియేటివ్‌గా కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలా అందరినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుంది అని అన్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రానున్న ప్రాపర్టీల పేర్లు:
పరంపర.. ఈ ఫ్యామిలీ డ్రామాలో జగపతి బాబు, శరత్ కుమార్ నటిస్తున్నారు.
బిగ్ బాస్ లైవ్.. ఓటీటీలో మొదటిసారిగా ప్రసారం కాబోతోంది. హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించనున్నారు.
9 అవర్స్.. క్రిష్ దర్శకత్వంలో తారక రత్న, అజయ్ నటిస్తున్న ఈ మూవీ థ్రిల్లింగ్ బ్యాక్ రాబరీ నేపథ్యంలో రాబోతోంది.
ఝాన్సీ.. మహిళలు, పిల్లలపై జరిగే అన్యాయలపై ఎదురుతిరిగే పోరాటం
సైతాన్.. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో రాబోతోన్న హారర్ చిత్రం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్ హీరోల సినిమాలు, యానిమేషన్ చిత్రాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కేంద్ర బిందువుగా ఉంది. ఇక హాట్ స్టార్ స్పెషల్, మెగా బ్లాక్ బస్టర్ చిత్రాలు నేరుగా రిలీజ్ అవుతున్నాయి. లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఎంటర్టైన్మెంట్‌ను అందించడంలో ది బెస్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలుస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గురించి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనేది ఇండియాలో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సంస్థగా ఎదిగింది. ఇండియన్స్ సినిమాలు, సిరీస్‌లను చూసే కోణాన్ని మార్చేసింది. దాదాపు పది వేల గంటలకు పైగా టాప్ క్వాలిటీ వీడియోలను అందించే రకరకాల సినిమాలు, సిరీస్‌లు, స్టార్ టెలివిజన్ సీరియల్స్ ముందుగానే అందుబాటులోకి వస్తాయి. ఇక ఇప్పుడు లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. డిస్నీ, పిక్సర్, మార్వెల్స్, స్టార్ వార్స్, నేషనల్ జాగ్రఫిక్ వంటి వాటికి సంబంధించిన ఎన్నో సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాల్డ్ డిస్నీ స్టూడియో నుంచి వచ్చే చిత్రాలు అయితే నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనే ఉంటాయి. ఇందులో మొబైల్, సూపర్, ప్రీమియం అంటూ మూడు రకాల ప్లాన్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏ ప్లాన్‌ను అయినా యూజర్లు ఎంచుకోవచ్చు. అవతార్ కంటే ముందుగా దాదాపు 400 మిలియన్ల డౌన్ లోడ్లు చేసుకున్నారు. దాంతో ఇండియాలోనే ది బెస్ట్ యాప్‌గా మారిపోయింది. అలా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో టాప్ ప్లేసులోకి వెళ్లింది.
ఈ యాప్ సక్సెస్ అనేది.. వీడియోస్ట్రీమింగ్ క్వాలిటీలో తెలుస్తుంది. డివైజ్, వాడే ఫ్లాట్ ఫాం క్వాలిటీ ఆధారంగా కూడా విజయవంతమైందని చెప్పవచ్చు.