Advertisementt

రిపబ్లిక్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీల మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌

Thu 23rd Dec 2021 08:50 AM
republic,sai tej,director deva katta,oka chinna family story,sangeeth shoban,simran,senior naresh,tulasi  రిపబ్లిక్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీల మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌
Republic, OCFS Mega Blockbuster Success Press Meet రిపబ్లిక్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీల మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌
Advertisement
Ads by CJ

జీ5 లో ఎంతో ప్రేక్షాదరణ పొందుతున్న రిపబ్లిక్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీల మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ జీ5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లు దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవ్‌ కట్టా కలయికలో రూపొందిన రిపబ్లిక్‌ సినిమా, అలాగే సంగీత్‌ శోభన్‌, సిమ్రాన్‌ జంటగా.. సీనియర్‌ నరేష్‌, తులసి, గెటప్‌ శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై మెగా డాటర్‌ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్‌ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ రెండూ జీ5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ పేరుతో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్‌ ప్రెసిడెంట్‌ పద్మా కస్తూరి రంగన్‌ మాట్లాడుతూ.. మీ అందరూ ఈసక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో జాయిన్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రిపబ్లిక్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఈ రెండిటి విషయంలో ముందు ఏది రిలీజ్‌ చెయ్యాలి అనే ఆలోచనలో పడిపోయాం. కొద్ది గ్యాప్‌లో వచ్చినప్పటికీ రెండిటినీ సూపర్‌ సక్సెస్‌ చేశారు ప్రేక్షకులు. ఇమ్మెన్స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మాకు సపోర్ట్‌ చేసిన ఆడియెన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. ఇటువంటి అద్భుతమైన కంటెంట్‌లను మాకు అందించిన మేకర్స్‌కు ధన్యవాదాలు అన్నారు.

అనంతరం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. కట్టా గారి విజన్‌ చాలా పెద్దది, గొప్పది. నాకు మంచి కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్‌ సినిమాలు కూడా ప్రొడ్యూస్‌ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఆడియెన్‌గా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకుచ్చి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్‌ థ్రెడ్‌ స్టోరీ. ఈ క్రెడిట్‌ మా డైరెక్టర్‌ మహేష్‌ గారు, రైటర్‌ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేష్‌ గారు నన్ను ఆ కథతో కనెక్ట్‌ చేసి నడిపించారు. ప్రతి సీన్‌ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. రిపబ్లిక్‌ సినిమా చాలా హానెస్ట్‌ మూవీ. క్లైమాక్స్‌ నాకు అద్భుతంగా అనిపించింది.

దర్శకులు దేవాకట్టా మాట్లాడుతూ.. నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్‌ చేయాలని ఉంది. నా దగ్గర 2,3 స్టోరీస్‌ ఉన్నాయి. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్‌ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్‌ చూపిస్తూ ఉంటారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్‌ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమామీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ను కోల్పోయాం. అది మనం చేసినతప్పే. ప్రేక్షకులకు మనం సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు.. ఆదరిస్తారు. మా రిపబ్లిక్‌ ఓటీటీలో గ్రాండ్‌ సక్సెస్‌ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్‌ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను. ఆడియెన్స్‌ అంటే అందరూ మన మనసులోనే ఉంటారు. కాబట్టే మనం రాసే క్యారెక్టర్స్‌ వారికి కనెక్ట్‌ అవుతుంటాయి. రిపబ్లిక్‌ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక డీప్‌ డిస్టబెన్స్‌ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది. నెక్ట్స్‌ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.

జీ స్టూడియో (తెలుగు) వైస్ ప్రెసిడెంట్  నిమ్మకాయల ప్రసాద్‌ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అయితే.. రిపబ్లిక్‌ ఒక పెద్ద సొసైటీ స్టోరీ. ఇది ప్రేక్షకుల మాట. ఈ ప్రాజెక్ట్స్‌లో భాగం అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ దర్శకుడు మహేష్‌ ఉప్పాల మాట్లాడుతూ.. ముందుగా నిహారిక గారికి థ్యాంక్స్‌. అలాగే జీ5 అనురాధ గారికి, ప్రసాద్‌ గారికి కూడా రుణపడి ఉంటాను. మా కంటెంట్‌ ఇంత సక్సెస్‌ కావటానికి జీ5 టీమ్‌ చాలా కష్టపడిరది. దేవాకట్టా గారితో డయాస్‌ పంచుకోవటం హ్యాపీగా ఉంది. నా డ్రీమ్‌ను నిజం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

జీ5 మార్కెటింగ్‌ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. ఈ టీం అందరితో కలిసి జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా కృషి చేసిన మా జీ5 టీం అందరికీ థ్యాంక్స్‌ చెపుతున్నా అన్నారు. అనంతరం ఈ సక్సెస్‌ను సెబ్రేట్‌ చేసుకుంటూ కేక్‌ కటింగ్‌ నిర్వహించారు.

Republic, OCFS Mega Blockbuster Success Press Meet:

Republic, Oka Chinna Family Story Mega Blockbuster Success Press Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ