మానస్ రాక్ స్టార్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అనంతరం నటుడిగా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న చిత్రాల్లో నటించి అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని మెప్పించి టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. అతను మాట్లాడే విధానం.. ఫిజికల్ టాస్కుల్లో అతను చూపించే ఉత్సాహం అందరినీ ఆకర్షించాయి.తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పట్ల అతను చూపించిన కేరింగ్ కు, అతని మెచ్యూర్డ్ థింకింగ్ కు యువత మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా మానస్ కు ఆకర్షితులైపోయారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకి ఆయన స్టైల్లోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉండడంతో పవన్ అభిమానులు సైతం మానస్ కు మద్దతిస్తూ అతను టైటిల్ గెలవాలని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
మానస్ టైటిల్ విన్నర్ కావాలని మానస్ రాక్ స్టార్ అనే పోస్టర్ ను ఆవిష్కరించిన కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.ఆర్.చౌదరి, టి.ఆర్.ఎస్.లీడర్ నాగమణి, ఇంటర్నేషనల్ డ్రెస్సెస్ డిజైనర్ అపర్ణ, మానస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.తేజు తదితరులు పాల్గొన్నారు.