Advertisementt

లక్ష్ చదలవాడ కొత్త చిత్రం

Wed 15th Dec 2021 05:05 PM
laksh chadalwada,laksh chadalwada new movie,chadalwada brothers,sri thirumala tirupathi venkateswara baner,vikranth  లక్ష్ చదలవాడ కొత్త చిత్రం
Laksh Chadalwada new movie లక్ష్ చదలవాడ కొత్త చిత్రం
Advertisement
Ads by CJ

ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకున్న లక్ష్ చదలవాడ కొత్త చిత్రం

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. వలయం సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే గ్యాంగ్ స్టర్ గంగ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అయితే మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ హీరో తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథ తో తెరకెక్కుతున్న ఈ వినూత్నమైన సినిమా తొందరలోనే షూటింగ్ కు వెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 12 గా చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ని పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లోని ఆఫీస్ కార్యాలయం లో జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: లక్ష్ చదలవాడ

సాంకేతిక నిపుణులు : సమర్పణ: చదలవాడ బ్రదర్స్, బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర, నిర్మాత: పద్మావతి చదలవాడ, దర్శకుడు: విక్రాంత్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ, ఫైట్ మాస్టర్: జాషువా, పీఆర్వో: సాయి సతీష్.

Laksh Chadalwada new movie:

Laksh Chadalwada new movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ