Advertisementt

విశాల్ లాఠీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

Mon 13th Dec 2021 07:02 PM
laatti movie,laatti telugu movie,vishal,sunaina,vinoth kumar,rana productions,ramana  విశాల్ లాఠీ సెకండ్ షెడ్యూల్ పూర్తి
Laatti Movie 2nd Schedule Successfully completed విశాల్ లాఠీ సెకండ్ షెడ్యూల్ పూర్తి
Advertisement
Ads by CJ

విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న పాన్ ఇండియన్ మూవీ లాఠీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ఏ వినోద్ కుమార్‌ దర్వకత్వంలో లాఠీ అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ సందర్బంగా మేకర్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో విశాల్ మీసం కట్టుతో కనిపించారు. రెండో షెడ్యూల్ చివరి రోజంతా చిత్రయూనిట్ పని చేసింది. ఇక ఇప్పుడు యూనిట్ అంతా కూడా మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు చేరుకుంది. ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించనున్నారు. లాఠీ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున విశ్రాంతి అనేది లేకుండా 24 గంటలు పని చేశామంటే నమ్మకశక్యంగా లేదు.. పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో టీం అంతా కలిసి మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు రాబోతోన్నాం అని విశాల్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

లాఠీ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో భారీ మార్పును తీసుకొచ్చే శక్తివంతమైన కథను ఇందులో చూపించబోతోన్నారు. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు. రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు.

నటీనటులు : విశాల్, సునయన

సాంకేతిక బృందం: డైరెక్టర్: ఏ వినోద్ కుమార్, నిర్మాతలు: రమణ, నంద, బ్యానర్: రానా ప్రొడక్షన్స్, రచయిత: పొన్ పార్థీబన్, మ్యూజిక్: సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యన్, ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి, పీఆర్వో: వంశీ-శేఖర్.

Laatti Movie 2nd Schedule Successfully completed:

Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Laatti 2nd Schedule Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ