Advertisementt

రవితేజ ఖిలాడి అప్ డేట్

Sun 12th Dec 2021 04:57 PM
mass maharaja,ravi teja,ramesh varma,satyanarayana koneru,khiladi movie,khiladi song shoot  రవితేజ ఖిలాడి అప్ డేట్
Ravi Tejja Khiladi Song Shoot From Tomorrow రవితేజ ఖిలాడి అప్ డేట్
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసి భారీ సెట్‌లో రేపటి నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు. ఇక మరొక పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ  రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది.

Ravi Tejja Khiladi Song Shoot From Tomorrow:

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru Khiladi Song Shoot From Tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ