Advertisementt

పుష్ప: ది రైజ్‌. ఉ అంటావా.. ఊఊ అంటావా..

Sat 11th Dec 2021 07:19 PM
pushpa,pushpa movie,allu arjun,pushparaj,rashmika mandanna,jagapathi babu,sunil,anasuya,fahadh faasil,prakash raj,devi sri prasad  పుష్ప: ది రైజ్‌. ఉ అంటావా.. ఊఊ అంటావా..
Pushpa Released on December 17th పుష్ప: ది రైజ్‌. ఉ అంటావా.. ఊఊ అంటావా..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌ నుంచి సమంత ఉ అంటావా.. ఊఊ అంటావా.. లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన..

పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె పాట విడుదలైంది. 2021లోనే అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. ఈ ఏడాది టాప్ సాంగ్ ఇదే అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు పుష్ప యూనిట్. పక్కా మాస్ లిరిక్స్ తో ఈ పాట హుషారుగా సాగిపోయింది. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. కెరీర్‌లో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేశారు సమంత. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు.

దర్శకుడు: సుకుమార్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా.

Pushpa Released on December 17th:

Pushpa Released on December 17th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ