Advertisementt

గోపీచంద్ లాంచ్ చేసిన కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్

Fri 10th Dec 2021 07:49 PM
koteswara rao gari kodukulu movie,koteswara rao gari kodukulu movie teaser,abhinav,satya mani,naveen eragani  గోపీచంద్ లాంచ్ చేసిన కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్
Koteswara Rao Gari Kodukulu Movie Teaser గోపీచంద్ లాంచ్ చేసిన కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్
Advertisement
Ads by CJ

మ్యాచో స్టార్ గోపీచంద్ చేతుల మీదుగా కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్ గ్రాండ్ లాంచ్

Click Here 👉 Koteswara Rao Gari Kodukulu Movie Teaser

అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం కోటేశ్వరరావు గారి కొడుకులు. (మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో ప్రియాంక డి, చందన హీరోయిన్లుగా నటిస్తుండగా.. వశిష్ట్ నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌‌ని మ్యాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు గోపీచంద్. ఈ మేరకు యూనిట్ సభ్యులను అభినందించారు.

టీజర్ విషయానికొస్తే.. 2 నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం ఖచ్చితంగా మనీ అయి ఉంటది అనే రియలిస్టిక్ డైలాగ్‌తో ప్రారంభమై ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మనీ కెన్ డు ఎనీథింగ్.. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అంటూ మోడ్రన్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్‌గా మారింది.

మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇదని, తండ్రీ కొడుకుల మధ్య మనీ మ్యాటర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకునే తండ్రి కల నెరవేరిందా? అదేవిధంగా తండ్రిని కోటీశ్వరుడు చేయాలనుకునే ఆ కొడుకుల ప్రయత్నం ఫలించిందా? అనే డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు: అభినవ్, సత్యమణి, వశిష్ట్ నారాయణ, ప్రియాంక డి, చందన కృష్ణ తదితరులు. సంగీతం: షారుఖ్ షేక్, కథ- దర్శకత్వం: నవీన్ ఎరగాని నిర్మాతలు: తన్వీర్ యం.డి, నిర్మాణ సంస్థ: మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్, పీఆర్వో: సాయి సతీష్ & పర్వతనేని రాంబాబు.

Koteswara Rao Gari Kodukulu Movie Teaser:

Koteswara Rao Gari Kodukulu Movie Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ