Advertisementt

ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ పూర్తి.!

Thu 09th Dec 2021 07:09 PM
tees mar khan,tees mar khan movie,adi sai kumar,adi sai kumar,payal rajput,sunil  ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ పూర్తి.!
Adi Sai Kumar Tees Mar Khan complete ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ పూర్తి.!
Advertisement
Ads by CJ

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్

వరుస మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్. RX 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై తన అందం అభినయంతో అందరిని మంత్ర ముగ్దులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్రం ను నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమా చేశాను. కథ తగ్గ హీరో ఆది సాయి కుమార్ ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు ఏదైతే కథ చెప్పాడో అదే తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ చిత్రం విజయవంతం గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆది సాయి కుమార్ ను సరికొత్తగా ఆవిష్కరించే సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: విజన్ సినిమాస్, డైరెక్టర్: కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్: నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి, మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటర్: మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి, పీఆర్.ఒ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Adi Sai Kumar Tees Mar Khan complete :

Adi Sai Kumar Tees Mar Khan complete 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ