Advertisementt

రామ్ అసుర్ నాకు పెద్ద విజయం -దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ

Mon 06th Dec 2021 07:29 PM
ram asur,director venkatesh triparna,abhinav sardhar  రామ్ అసుర్ నాకు పెద్ద విజయం -దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ
Ram Asur is a big win for me -Director Venkatesh Triparna రామ్ అసుర్ నాకు పెద్ద విజయం -దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ
Advertisement
Ads by CJ

రామ్ అసుర్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషం గా ఉంది - దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ

ఇటీవల కాలంలో ప్రతిభగల దర్శకులకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి కథ తో వస్తే ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమాలు చేసే నిర్మాతలు ఉన్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ అసుర్ చిత్రం వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు వెంకటేష్ త్రిపర్ణ. తొలి సినిమా నే ఈ స్థాయిలో చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు విమర్శకుల నుంచి ప్రశంశలు అందుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చి అయన ఒక మాస్ ఎంటర్ టైనర్ ను తొలిసారిగా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఆద్యంతం సినిమాను ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు లవ్, డ్రామా, సై-ఫై వంటి అంశాలు మేళవితమై ఉన్నాయి అని చెప్పారు. సినిమా లోని చివరి 20 నిముషాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. 

అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ లు హీరోలుగా నటించగా చాందిని తమిళరసన్, శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. కీలకమైన పాత్రలో శానీ సల్మాన్ నటించగా ఈ సినిమా కు ఈ పాత్ర హైలైట్ గా నిలిచింది. బెంగాల్ టైగ‌ర్ సినిమా తో మంచి పేరు దక్కించుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కి సంగీతం సమకూర్చగా జె. ప్ర‌భాక‌రరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ ... రామ్ అసుర్ సినిమా నీ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇక మంచి సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయ్యింది.  సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ప్రతిఫలం విజయం రూపంలో వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమా లతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను అని అన్నారు.

Ram Asur is a big win for me -Director Venkatesh Triparna:

Director Venkatesh Triparna Winning Accolades For Ram Asur

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ