Advertisementt

బంగార్రాజు నుంచి నా కోసం సాంగ్

Sun 05th Dec 2021 05:44 PM
bangarraju,naa kosam song,akkineni nagarjuna,naga chaitanya,ramya krishna,krithi shetty,chalapathi rao,rao ramesh,brahmaji,vennela kishore,jhansi  బంగార్రాజు నుంచి నా కోసం సాంగ్
Naa Kosam Song From Bangarraju బంగార్రాజు నుంచి నా కోసం సాంగ్
Advertisement
Ads by CJ

బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి  విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది, కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాపై అంచనాలు విప‌రీతంగా పెరిగాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

సెకండ్ సింగిల్ నా కోసం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. నేడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది.

నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో  నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ బంగార్రాజు చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

Naa Kosam Song From Bangarraju :

Naa Kosam Song From Bangarraju Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ