Advertisementt

రామ్ అసుర్ తో బిగ్ ప్రాజెక్టుల్లో.. -అభినవ్ సర్దార్

Thu 02nd Dec 2021 06:09 PM
ram asur,ram asur movie,ram asur telugu movie,abhinav sardar  రామ్ అసుర్ తో బిగ్ ప్రాజెక్టుల్లో.. -అభినవ్ సర్దార్
Ram Asur Big success in my career -Abhinav Sardar రామ్ అసుర్ తో బిగ్ ప్రాజెక్టుల్లో.. -అభినవ్ సర్దార్
Advertisement
Ads by CJ

రామ్ అసుర్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది: అభినవ్ సర్దార్  

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ఇటీవల విడుదలైన రామ్ అసుర్ తన కెరీర్‌లో బిగ్ సక్సెస్ అందుకున్నారు. సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో టాలెంట్ చూపిస్తూ ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండాఫ్‌లో అసురుడిగా మెప్పించారు. ఈ మూవీలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్‌గా ప్రేక్షకుల నోళ్ళలో నానుతున్నారు. 

రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రామ్ అసుర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుండటం పట్ల హీరో అభినవ్ సర్దార్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్ల క్రింద తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన అభినవ్ సర్దార్.. తన సంపాదనలో 10 శాతం మేర దాతృత్వ పనుల కోసం ఖర్చు చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. 

ఈ సందర్భంగా అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. రామ్ అసుర్‌ సినిమాతో నటుడిగా, నిర్మాతగా బిగ్ సక్సెస్ అందుకున్నా. కెరీర్‌లో ఇంకా చాలా సాధించేది ఉంది. అను నిత్యం నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటా. ఈ చిత్రంలో నేను పోషించిన రెండు డిఫరెంట్ షేడ్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకొని నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. మూవీ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్, సినీ క్రిటిక్స్, సినీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంసలతో కెరీర్‌పై మరింత నమ్మకం పెరిగింది. ముందు ముందు మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకలోకాన్ని అలరిస్తా. 

రామ్ అసూర్ విజయం తర్వాత నాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా కొన్ని బిగ్ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విజయం కొత్త ఉత్సాహాన్నివ్వడమే గాక నటుడిగా నా లోని టాలెంట్ బయటపెట్టే అవకాశం ఇచ్చింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గాను  దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞలు చెబుతున్నా. త్వరలో నా తదుపరి సినిమాల వివరాలను వెల్లడిస్తా అన్నారు.

Ram Asur Big success in my career -Abhinav Sardar :

Ram Asur is best known for his role as an actor in the film: Abhinav Sardar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ