తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ రోజు సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన డాలర్ శేషాద్రి కి వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు. 1978 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవలో ఆయన తరిస్తున్నారు. గతంలోనే రిటైర్మెంట్ అయినప్పటికీ.. డాలర్ శేషాద్రి మళ్ళీ ఓఎస్డీగా ప్రభుత్వం నియమించడంతో తిరుమల ఆలయానికి సేవలు అందిస్తున్నారు.