రిపబ్లిక్ బృందంతో కలిసి జీ 5 లో సినిమా చూసిన సాయి తేజ్
హీరో సాయి తేజ్ జీ 5 ఓటీటీ వేదికలో రిపబ్లిక్ సినిమా చూశారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో ఆయన చూడలేకపోయారు. అందుకని, జీ 5లో చూశారు.