Advertisementt

శ్యామ్ సింగ రాయ్ నుంచి ఏదో ఏదో లిరికల్

Thu 25th Nov 2021 05:31 PM
shyam singa roy,shyam singa roy movie,shyam singa roy telugu movie,nani,yedo yedo lyrical video  శ్యామ్ సింగ రాయ్ నుంచి ఏదో ఏదో లిరికల్
Edo Edo lyrical video release from Shyam Singa Roy శ్యామ్ సింగ రాయ్ నుంచి ఏదో ఏదో లిరికల్
Advertisement

న్యాచురల్ స్టార్ నాని, కృతి శెట్టిల శ్యామ్ సింగ రాయ్ నుంచి ఏదో ఏదో లిరికల్ వీడియో విడుదల

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండబోతోన్నందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయాన్నా కేటాయించారు. ఈ గ్యాప్‌లో సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు.

మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా సెకండ్ సింగిల్ ఏదో ఏదో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, కృతి శెట్టిల మీద రూపొందించిన ఈ మెలోడి సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకున్న  మిక్కీ జే మేయర్.. ఇప్పుడు మెలోడి ట్యూన్‌ ఇచ్చారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను.. చైత్ర అంబడిపుడి ఆలపించారు. మెలోడి ట్యూన్, అద్బుతమైన గాత్రం, ఆకట్టుకునే సాహిత్యంతో పాటు నాని, కృతి శెట్టిల రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటలోనే లిప్ లాక్ కూడా కనిపిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వెరైటీ ట్యూన్స్ ఇవ్వడంతో మిక్కీ జే మేయర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

Edo Edo lyrical video release from Shyam Singa Roy:

Yedo Yedo lyrical video release from Shyam Singa Roy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement