న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంధర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
కథా రచయిత సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. విప్లవాత్మక ప్రేమ గాథ. రెండు భిన్న ధృవాలు. విప్లవం మనసుది. ప్రేమ హృదయానిది. ఈ రెండు కలగలిపే కథే శ్యామ్ సింగ రాయ్. ఇంత స్పాన్‌కు వెళ్తుందని అనుకోలేదు. నా కథ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇంత స్థాయికి చేరుతుందని అనుకోలేదు. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నాని గారికి థ్యాంక్స్. ఇది దృశ్య కావ్యంగా మారుతుంది అని అన్నారు
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి కొన్ని రోజులే పని చేశాను. కానీ ఎంతో ఎనర్జీగా పని చేశాను. సెట్‌లో అందరూ మంచివాళ్లు. నాని ఎంతో సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ మా నుంచి ఎంతో నటనను రాబట్టుకున్నాడని అనుకుంటున్నాను. నేను సాయి పల్లవికి ఫ్యాన్. ఆమెతో ఒక సీన్ ఉంటుంది. ఒక్క చూపులోనే పేజీలకు పేజీల డైలాగ్స్ చెప్పినట్టుంది. కృతి శెట్టితో కలిసి సీన్స్ చేయలేదు. కానీ ఆమె చాలా స్వీట్ గర్ల్. మడోన్నా ఎంతో ప్రొఫెషనల్. తెలుగు సినిమాకు కొత్త నిర్మాత దొరికారు. నిర్మాత కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానుఅని అన్నారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. టీజర్ చూసిన తరువాత మీ రియాక్షన్ చూసి నాకే ఏదో వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే థియేటర్లో సినిమా చూస్తే ఇంకా ఎలా ఉంటుంది. నేను కూడా నాని అభిమానినే. థియేటర్లో సినిమా చూసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నాను. మీరు ఇప్పుడు చూసింది వంద సెకన్లే. సినిమాలో అంతకు మించి ఉంటుంది. డిసెంబర్ 24న సినిమా రాబోతోంది. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఉంటుంది అని అన్నారు.
నాని మాట్లాడుతూ.. రెండేళ్ల తరువాత థియేటర్‌కు వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి కదా?..కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. క్రిస్మస్ మాత్రం మనదే. మంచి టీం దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి శ్యామ్ సింగ రాయ్ ఉదాహరణగా నిలిచిపోతుంది. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత వెంకట్ గారికి థ్యాంక్స్. మీ అందరితో కలిసి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా? అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రతీ సినిమాను కొత్తగా కనిపించాలని, కొత్త ఫేజ్‌ను మొదలుపెట్టాలని అనుకుంటాం. కానీ ప్రతీసారి వర్కవుట్ కాకపోవచ్చు. కానీ అన్ని సినిమాలకు పెట్టే శ్రమ మాత్రం ఒక్కటే. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ఎంసీఏ సినిమాతో వచ్చాను. ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. ఎపిక్ లవ్ స్టోరీ. నేను ఏ టెక్నీషియన్, నటీనటుల్లోనూ కొత్త పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. అందరినీ అలరించే సినిమాను చేయాలని అనుకుంటాం. శ్యామ్ అమ్మ తెలుగు. నాన్న బెంగాలి. కథ విన్నప్పుడు నాకు ఓ హై వచ్చింది. ఇలా కనుక సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాం. కాని అంతకంటే బాగా వచ్చింది. సాయి పల్లవితో ఇది వరకే ఎంసీఏతో హిట్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 24న ఏం జరగబోతోందో కూడా నాకు తెలుసు. హిట్ కాంబినేషన్‌గా మేం చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువగా అర్థం కాకూడదనే టీజర్‌ను అలా కట్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతీ సినిమాలో ఇది వరకు చూడని నానినే చూస్తారు. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది. మీ ఎనర్జీని దాచి పెట్టుకోండి. డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ వస్తుంది.. క్రిస్మస్ మనదే అని అన్నారు..