Advertisementt

దృశ్యం 2 ట్రైలర్ లాంచ్

Tue 16th Nov 2021 01:03 PM
venkatesh,drushyam 2 movie,venkatesh drushyam 2 movie,drushyam 2 trailer launch  దృశ్యం 2 ట్రైలర్ లాంచ్
Drushyam 2 trailer launch దృశ్యం 2 ట్రైలర్ లాంచ్
Advertisement

విక్టరీ వెంకటేష్ హీరోగా,  జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో  భాగంగా చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు..

వెంకటేష్ మాట్లాడుతూ.. ఈరోజు దృశ్యం 2 ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దృశ్యం-1 తర్వాత అలాంటి సినిమా చేయాలని అనుకున్నాను. జీతూ దృశ్యం-2 తో నా వద్దకు వచ్చారు. అది మలయాళంలో చాలా పెద్ద హిట్. మీ అందరికి తెలిసిందే. ప్రేక్షకులు అందరు ఈ సినిమాను అదరిస్తారనే నమ్మకం ఉంది. దృశ్యం 2 చెసేటప్పుడు ఎలాంటికి ఒత్తిడికి గురికాలేదు. జీతూ స్క్రిప్ట్ చూశాక అలాంటిదేమి అనిపించలేదు. దృశ్యం 1 తర్వాత ప్రేక్షకులు అలాంటి సినిమా కోసం ఎదురుచూశారు. మలయాళంలో మోహన్‌లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. అద్భుతంగా చేశారు. సినిమా నేను చూశాను.. చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను కొత్త రకం సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు అదరిస్తూనే వచ్చారు. రాంబాబు లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాం. ఆ పాత్రల్లో ఇప్పటికీ ఓ కనిపించని భయం.. ఆరేళ్ల తర్వాత విచారణ ప్రారంభం కావడం.. చాలా థ్రిలింగ్‌గా ఉంటుంది సినిమా.  అలాంటి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఆ ప్రాబ్లమ్‌ నుంచి ఎలా బయటపడతామనేది జీతూ చాలా బాగా చూపించాడు. అలాంటి స్క్రిప్ట్ చూసి ఉండరు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ గెస్ చేయలేరు. చాలా ట్విస్ట్‌లు, మలుపులు ఉంటాయి. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నా విషయానికి వస్తే..సెట్‌కు వెళ్లగానే రాంబాబు వచ్చేస్తాడు. ఆ క్యారెక్టర్‌లో బ్యూటీ అలాంటిది. ఒరిజినల్‌ క్యారెక్టర్ చేసిన మోహన‌లాల్‌ను చూసి స్టన్ అయ్యాను. చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఒక్క చిన్న టౌన్‌లో ఉండి.. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం అని అన్నారు.

జీతూ మాట్లాడుతూ.. రాజమౌళి నుంచి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నిజంగా నమ్మలేకపోయాను. నేను హైదరాబాద్‌లో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది. నేను మొదట నమ్మలేదు. నేను రాజమౌళి పేరు చెప్పకుండా నా భార్య, పిల్లలకు ఆ మెసేజ్ చదివి వినిపించాను. నా కూతురు ఎవరూ పంపారు అని అడిగింది. నేను రాజమౌళి అని చెప్పాను. కానీ నేను ట్రిక్స్ ప్లే చేస్తున్నానని నవ్వింది. కానీ తర్వాత మెసేజ్ చూసి.. ఆశ్చర్యంతో జంప్ చేసింది. గొప్ప దర్శకుడి నుంచి అలాంటి మెసేజ్ రావడం.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. తర్వాత నేను వెంటనే దానిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను.  నిజం చెప్పాలంటే.. తెలుగు వెర్షన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. ఒరిజినల్‌గా మలయాళం.. ఇప్పుడు తెలుగులో తీస్తున్నాం. కల్చరల్‌గా కొన్ని మార్పులు చేశాం. మూడు, నాలుగు సీన్లు మలయాళం ఉన్నవే.. కానీ కొద్దిగా మార్చాం. ప్రజెంటేషన్‌లో మార్పులు చేశాం. భారీ మార్పులు చేయలేదు. అలా చేసి ఉంటే.. మొత్తం స్టోరీపై ఎఫెక్ట్‌ పడేది. తెలుగులో మార్పులు చేయడానికి ఎలాంటి చాలెజింగ్ అనిపించలేదు. రైటర్ రమేష్, సురేష్ బాబు నుంచి మంచి సపోర్ట్ ఉంది. అందువల్ల ఇది నాకు బర్డెన్‌ అనిపించలేదు అని అన్నారు.

రాజ్‌కుమార్ సేతుపతి  మాట్లాడుతూ.. ప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఫ్యామిలీ థియేటర్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు. అందుకే ప్రతి ఇంటికి సినిమా చేరేందుకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నాం. మేము ప్రపంచంలోని అన్ని రకాల అడియన్స్‌కు రీచ్ కావడానికి ఇలా చేశాం. ఫ్యామిలీ అడియన్స్‌కు చేరువ కావాలని అనుకున్నాం. మేము కొన్ని నెలలుగా ఎదురు చూశాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. మంచి ఫిల్మ్‌ ఎక్కువ కాలం హోల్డ్‌లో ఉంచకూడదని.. అమెజాన్‌లో విడుదల చేస్తున్నాం. మలయాళంలో సినిమా చూడకుండానే.. నాకు గతంలో చెప్పిన స్టోరిపై నమ్మకంతో అన్ని లాంగ్వేజేస్ రైట్స్ కొనేశాను అని అన్నారు.

శ్రీ ప్రియ మాట్లాడుతూ.. దృశ్యం 1 రిలీజ్‌ అయిన తర్వాత దీనికి సీక్వెల్ చేయమని నేను జీతూను అడిగాను.. కానీ జీతూ తిరస్కరించాడు. తాను న్యాయం చేయలేనని చెప్పాడు. ఇప్పుడు సీక్వెల్ తీయడం.. తెలుగులో కూడా జీతూ డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. పార్ట్ 2లో భాగం కానందుకు ఫీలింగ్ ఎమిటని చాలా మంది అడిగారు.. చాలా బాధగా ఉంది.  దృశ్యం 3,4,5.. కూడా చేయాలని కోరుకుంటున్నాను. జీతూ పార్ట్‌-2లో నేను ఉండేలా చూడాలని అనుకున్నాడు.. కానీ కరోనా వల్ల కుదరలేదు. రాంబాబు క్యారెక్టర్‌కు వెంకటేష్‌కు మించి ఎవరూ సూట్ అవ్వరు అని అన్నారు.

మీనా మాట్లాడుతూ..వెంకటేష్‌తో సినిమాలో చేసే కొత్తలో నేను చాలా కామ్‌గా ఉండేదాని. భయపడేదానిని. వెంకటేష్ కూడా చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఇప్పుడు చాలా సినిమాలు కలిసి చేసిన తర్వాత.. చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ఆయనను అడుగుతాను. ఇది ఇలా చేయచ్చా.. అర్థం ఏమిటి..? ఇలాంటివి అడుగుతాను. మంచి కోస్టార్. గుడ్ ఫ్రెండ్. తెలుగు డిక్షన్ అనేది బ్యాడ్‌గా అనిపించలేదు. నాకు తెలుగు బాగా తెలుసు కదా.. అని అనుకున్నాను. డబ్బింగ్ టైమ్‌లో డిక్షన్ కరెక్షన్ చేసినప్పుడు కొన్ని నేర్చుకున్నాను అని అన్నారు.

ఎస్తర్ మాట్లాడుతూ.. నేను ఒక వ్యక్తిగా సినిమా బయట, సినిమా లోపల చాలా మారిపోయాను. సినిమాలో ఎప్పుడు అమ్మతో గొడవ పడతాను.. నాన్న సపోర్ట్‌ చేస్తుంటాడు. దృశ్యం సినిమా ఎప్పుడు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. క్యారెక్టర్ చాలా స్వీట్‌గా ఉంటుంది. అలాంటి రోల్ ప్లే చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. సెట్స్‌లో జీతూ సార్ ఫన్‌‌గా ఉంటారు. వెంకటేష్, జీతూ సార్ కూతురు, నేను ఒకే స్కూల్‌కు వెళ్తాం. ఆయన చాలా కాలం నుంచి నాకు తెలుసు. మీనా గారు కూడా చాలా ఫన్‌గా ఉంటారుఅని అన్నారు.

నరేష్ మాట్లాడుతూ.. దృశ్యం 1 తెలుగు స్క్రీన్ మీద గేమ్ ఛేంజర్. కథ, జానర్, తీసిన విధానం చాలా గొప్పది. చాలా మంచి థ్రిల్లింగ్ సినిమా. తెలుగు సినిమా అడియన్స్ చాలా బాగా ఆదరించారు. షూటింగ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. దృశ్యం 2 మరో లెవల్. ఈ సినిమాలో ఒక మంచి సీన్.. నా జీవితంలో మర్చిపోలేను.  అది చిత్రంలో లాస్ట్ సీన్. రాజమౌళి చెప్పిన తర్వాత నేను ఇంకా ఏం చెప్పలేను. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా థ్రిల్‌గా ఉంది. శ్రీ ప్రియ వల్ల ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఈ సినిమా చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. దృశ్యం 1లో క్యారెక్టర్ తర్వాత నా లైఫ్ మారిపోయింది. చాలా డిఫరెంట్ రోల్స్ చేశానుఅని అన్నారు.

సంపత్ మట్లాడుతూ.. దృశ్యం 1 సినిమా నేను చెన్నైలో చూసినప్పుడు దీనికి సీక్వెల్ వస్తుందని చెప్పాను. అది నేను నమ్మాను. ఒకవేళ అది నిజమైతే నేను కూడా అందులో భాగం కావాలని అనుకున్నాను. సురేష్ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది.. అది నెరవేరింది. జీతూ వర్క్ చేయడం చాలా డిఫరెండ్ ఎక్స్‌పీరియన్స్. నా చాలా సినిమాల్లో చేసినట్టుగా ఈ సినిమాలో అరవలేదు. చాలా డిఫరెంట్‌గా చూపించారు. ఏదైనా తప్పైతే జీతూ డైరెక్ట్‌గా చెప్పేవారు.. బాగుంటే ప్రశంసించేవారు.. అది జీతూలో నాకు చాలా నచ్చింది. అన్ని చాలా బాగా కుదిరాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అడియన్స్ ఈ సినిమాను ఇష్టపడతారు. దృశ్యం..3,4,5 రావాలని కోరుకుంటున్నాను.. అందులో నేను కూడా ఉండాలి. ఈ సినిమా నా క్యారెక్టర్ గురించి ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో.. సినిమాలో కూడా అలానే ఉంటానుఅని అన్నారు.

సుజా మాట్లాడుతూ..నవంబర్ 25 ఎప్పుడు వస్తుందని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను చాలా లక్కీ. ఈ సినిమా నాకు రావడం గాడ్ గిఫ్ట్. శ్రీ ప్రియ, రాజ్‌కుమార్‌ వల్ల నాకు ఈ సినిమా వచ్చింది. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. స్పేస్ ఇచ్చారు. వెంకటేశ్, మీనాకు స్పెషల్ థాంక్స్. జీతూ చాలా నేర్పించారు. ఆయన చెప్పినట్టుగా నేను చూశాను అని అన్నారు.

Drushyam 2 trailer launch:

Venkatesh Drushyam 2 trailer launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement