Advertisementt

డేట్ మార్చుకున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి

Mon 15th Nov 2021 07:11 PM
good luck sakhi,keerthy suresh,good luck sakhi locks new release date,keerthy suresh good luck sakhi  డేట్ మార్చుకున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి
Good Luck Sakhi release date changed డేట్ మార్చుకున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి
Advertisement
Ads by CJ

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో  న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది.

తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర ఓ ప్రకటన చేశారు. పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో  ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామని అన్నారు.

 

Good Luck Sakhi release date changed:

Good Luck Sakhi locks new release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ