Advertisementt

ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుభవించు రాజా

Mon 15th Nov 2021 04:12 PM
raj tarun,bathike haayiga song,anubhavinchu raja movie  ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుభవించు రాజా
Bathike Haayiga song from Anubhavinchu Raja released ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుభవించు రాజా
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను, రెండో  పాట ‘నీ వల్లే రా’ను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు.

ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించనున్నారు. సెక్యూరిటీ గార్డుల మీద తెర‌కెక్కిన మూడో పాట‌ను హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్ లో సెక్యూరిటీ గార్డుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.

బతికే హాయిగా అంటూ సాగిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా..దీపు ఆలపించారు. గోపీ సుందర్ అందించిన బాణీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మాట్లాడుతూ.. ఈ పాటను సెక్యురిటీ గార్డ్‌లందరికీ అంకితం చేస్తున్నామని అన్నారు.

లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ఎప్పుడూ ఎదుటోళ్లలో తప్పులు వెతికేటప్పుడు నువ్ కూడా ఓ మనిషివే అని గుర్తు పెట్టుకోవాలి. ఏ లోపం లేకపోతే మనం దేవుళ్లం అయిపోయే వాళ్లం కదా? మనకీ ఎమోషన్స్, కోపం ఉంటాయి.. అది అర్థం చేసుకోవాలని చెప్పిన ఆ లైన్స్ నాకు బాగా నచ్చాయ్ అని అన్నారు..

డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పాటలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్‌లా నెక్ట్స్ లెవెల్‌లో కనిపించారు. అద్భుతంగా పాటన రాసినందుకు భాస్కర భట్ల గారికి థ్యాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీసుందర్‌కు ధన్యవాదాలు. సెక్యురిటీ పాత్రను రాజ్ తరుణ్ పోషించారు. చాలా మంది సెక్యురిటీ గార్డులను కలిసి వారి నుంచి ఎంతో తెలుసుకున్నాను. సినిమా బాగా వచ్చింది. నవంబర్ 26న రాబోతోందని అన్నారు.

రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. వారందరికీ హ్యాట్సాఫ్. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు అని అన్నారు.

Bathike Haayiga song from Anubhavinchu Raja released:

Anubhavinchu Raja press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ