Advertisementt

రాక్షస కావ్యం ఫస్ట్ లుక్

Mon 15th Nov 2021 02:58 PM
raakshasa kaavyam,raakshasa kaavyam first glimpse,raakshasa kaavyam title  రాక్షస కావ్యం ఫస్ట్ లుక్
Raakshasa Kaavyam first glimpse రాక్షస కావ్యం ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

నవీన్ బేతిగంటి,అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్,దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాక్షస కావ్యం. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా..శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సంస్థలు జార్జి రెడ్డి, గువ్వ గోరింక చిత్రాలను నిర్మించాయి. దాము రెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాక్షస కావ్యం సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు. 

ఫస్ట్ లుక్ సందర్భంగా విడుదల చేసిన వీడియో చూస్తే... విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంతో శ్రీ వెంకటేశ్వరుడి ఫొటోను చూపిస్తూ మొదలైంది. అక్కడే టైటిల్ రివీల్ చేశారు. ..ఒక్క మాట యాది ఉంచుకో బిడ్డ, మనసంటోళ్లు పదిమంది చచ్చిపోయినా ఎవ్వరికి ఫరక్ పడదు, కానీ ఒక్కడు సదువుకుంటే మనసంటోళ్లను వందమందిని బతికిస్తడు... అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు. కావ్యం మొదలైంది అంటూ వీడియో చివరలో వేశారు. శివ సినిమా కటౌట్ థియేటర్ ను చూపించడం ద్వారా కథ 90వ దశకానికి సంబంధించినదిగా అర్థమవుతోంది. రాక్షస కావ్యం సినిమాను పీరియాడిక్ సోషల్ యాక్షన్ డ్రామాగా చెప్పొచ్చు.

Raakshasa Kaavyam first glimpse :

Raakshasa Kaavyam first glimpse shows the power