Advertisementt

రామ్ అసుర్ గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్

Sun 14th Nov 2021 07:06 PM
ram asur movie,ram asur pre release event,maruthi  రామ్ అసుర్ గ్రాండ్  ప్రి-రిలీజ్ ఈవెంట్
Ram Asur Pre Release event రామ్ అసుర్ గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్
Advertisement

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ  సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న పీనట్ డైమండ్ చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్ ను `రామ్ అసుర్`గా మార్చడమైనది.  ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రిలీజ్ చేయడం విశేషం .సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌ రిస్తున్నారు. ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమాకి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా సినిమా పై కూడా మంచి అంచనాలు పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామ్ అసుర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 19 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు మారుతి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు హరినాథ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్,నిర్మాత రాజ్ కందుకూరి,ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్, గోపాల్,నటులు విజయ్ శంకర్, సాయి,నవీన్,సోలో బ్రతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు, ఆర్.కె,తదితరులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. దర్శకుడు మారుతి ప్రి రీలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా, దర్శకుడు బుచ్చి బాబు ఎం చేశావే మాయ మా"సాంగ్ ను లాంచ్ చేశారు. అనంతరం రామ్ అసుర్ మొదటి బిగ్ టికెట్ ను దర్శకులు మారుతి,నిర్మాత బెల్లంకొండ సురేష్ లు విడుదల చేసి ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.అనంతరం

ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ ..వెంకటేస్ మా బ్యానర్ లోని ఈ రోజుల్లో సినిమాకి పని చేశాడు అప్పుడు కూడా తను కథ చెప్పడానికి ట్రై చేసే వాడు. అప్పుడే తను మంచి దర్శకుడు అవుతాడను కొన్నాను. ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేసి వచ్చి నాకు ఒక కథ చెప్పాడు నీలో మంచి డైరెక్టర్ వున్నాడు చేయమని సపోర్ట్ చేశాను.ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ తీసుకువచ్చి నాకు చూపించాడు.చిత్ర ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.మనము తీసిన సినిమాను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు తను చేసిన ఈ మొదటి ప్రయత్నంమే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ దాక తీసుకువచ్చాడు అంటే తన వెనక ఎంత కష్టం ఉంతుందో నాకు తెలుసు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇటువంటి కాన్సెప్ట్ సినిమా రాలేదు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు 

 *దర్శకుడు హరినాథ్ గారు  మాట్లాడుతూ.* .ఈ సినిమాను తీసిన నిర్మాతలు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు. రెగ్యులర్ సినిమాలు తీయకుండాఎంతో ప్యాషనేట్ గా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకొని తీస్తున్నారు. మాస్ క్యారెక్టర్ లో అభినవ్ ఎక్సలెంట్ పర్ఫామెన్స్ చేశాడు. హీరోయిన్స్ కూడా చాలా చక్కగా నటించారు.దర్శకుడు వెంకటేష్ నాకు ఏడు సంవత్సరాల నుండి పరిచయం ఉంది.తను ఎప్పుడూ నాతో చిరంజీవి గారంటే  ప్రాణం అనే వాడు .ఒక వెంకటేష్ కు మాత్రమే కాదు మాకు కూడా చిరంజీవి అంటే ఇష్టమే. మేము చిరంజీవిగారి సినిమాలు చూసే పెరిగాము, ఆయనను చూసే ఇండస్ట్రీకి వచ్చిన మనమందరం ఆయన ఇన్స్పిరేషన్ తో ముందుకు వెళ్తున్నాం.ఇప్పటికీ మెగా స్టార్ అనేది ఒక చిరంజీవి మాత్రమే ఉంది ఇంక ఎవరికీ లేదు భవిష్యత్తులో రాదు అని అను కుంటున్నాను.ఈ సినిమా కోసం దర్శకుడు వెంకటేష్ చాలా కష్టపడ్డాడు. గ్రేట్ లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ చెప్పినట్టు ఒక సినిమా చేస్తే దర్శకుడికి ఐదు సంవత్సరాలు లైఫ్ తగ్గుతుంది అన్నాడు. కాబట్టి దర్శకుడు ఒక సినిమా తీయాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒక దర్శకుడుగా నాకు తెలుసు తను ఈ సినిమాకు డైరెక్టర్ గా చేస్తూ ప్రొడక్షన్ కూడా చూసుకున్నాడు కాబట్టి తను ఎంత కష్టపడ్డాడో సినిమా ట్రైలర్, టీజర్ ను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు థియేటర్కు జనాలు రావాలంటే ఇప్పుడు ప్రేక్షకులకు ఒక మాస్ కంటెంట్ అవసరం ఉంది.అందుకే నేను కూడా మీరు తీసిన మంచి కంటెంటు ఉన్న సినిమాను ప్రేక్షకులు మిస్ అవుతారని, ఓటీటి కంటే థియేటర్స్ కి వెళితే బాగుంటుందని, చెప్పడం జరిగింది.మాస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 *నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ...* అభినవ్ సర్దార్ నాకు చాలా రోజుల నుంచి మిత్రులు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి నాకు ప్రతి అప్ డేట్ చెబుతూ ఉంటాడు తను చేస్తున్న అన్ని ప్రాజెక్టు లలో సక్సెస్ అవుతున్నట్టే ఇందులో కూడా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. అందరూ ఓటిటి కు వెళ్తున్న టైంలో ఈ చిత్ర నిర్మాతలు రిస్క్ చేసి "రామ్ అసుర్" ను థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఓటిటి లో విడుదల చేస్తే ఎటువంటి ఖర్చు ఉండదు.కానీ లక్షల ఖర్చుతో ప్రమోషన్స్ చేసి థియేటర్లో విడుదల చేస్తున్న ఈ నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్శకుడు చాలా సంవత్సరాలు కష్టపడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న  వెంకటేష్ కి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి.కెమెరామెన్ J ప్రభాకర్ గారు నాకుమంచి మిత్రులు పెద్దపెద్ద కెమెరాలతో సినిమాలు తీస్తున్న టైంలో 5D కెమెరాతో తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి సెన్సెషన్ క్రియేట్ చేశాడు.ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు 5D లో వందల సినిమాలకు చేసి వారందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. చిన్న సినిమాల మీద తను ఉన్న ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.రామ్ అసుర్ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కచ్చితంగా థియేటర్ కు రావాలి. ఈ నెల 19న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని  కోరుతున్నాను అన్నారు. 

 *చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ** .. మాది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం మా తల్లిదండ్రులు ఏంతో కష్టపడి నన్ను చదివించు కుంటూ నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్టేజికి తీసుకువచ్చారు. నేను ఈరోజు ఈ స్టేజ్ పైన ఉండడానికి కారణం మా తల్లిదండ్రులు వారికి నా పాదాభివందనాలు.నన్ను బ్లెస్స్ చేయడానికి ఎంతోమంది నా ఫ్రెండ్సు శ్రేయోభిలాషులు మా ఊరైన తుని నుండి వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు. జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు వారిలో మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి  వారిని వ్యక్తి అనే దానికంటే దేవుడు అంటే సబబుగా ఉంటుంది 1980, 90 లలో ఎన్నో లక్షల మందికి  ఇన్స్పిరేషన్ అయ్యారు. అందులో నేనూ ఒకడిని. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఆయన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీ కు రావడం జరిగింది.మొత్తంగా చెప్పాలంటే హనుమంతుడికి రాముడు ఎలాగో నాకు కూడా మెగాస్టార్ చిరంజీవి .ఆ తర్వాత రెండో వ్యక్తి దర్శకుడు మారుతి గారు కూడా దిగువ మధ్య తరగతి లో పుట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. వారిని కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను మారుతి గారి దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చిన్న బడ్జెట్ లో కూడా ఒక మంచి సినిమా తీసి హిట్ కొట్టవచ్చు అని నిరూపించారు మారుతి గారు అలాగే  పెద్ద బడ్జెట్లో ఎక్కువ స్పాన్ తీసుకొని పెద్ద సినిమా తీసి హిట్ కొట్టచ్చు అని  అలాగే ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్ లో తక్కువ వర్కింగ్ డేస్ లో కూడా చేసి విజయం సాధించచ్చు అని నిరూపించారు. వాస్తవానికి నేను హనుమాన్ భక్తున్ని ఈరోజు మారుతి గారు రావడం వల్ల నాకు ఏమనిపిస్తుందంటే పైన ఆ హనుమంతుడైన మారుతి గారే నన్ను ఆశీర్వదించడానికి ఈ మారుతి గారిని  పంపించడాని అనిపిస్తుంది. వారు ఎంతో బిజీ ఉన్నా కూడా బిజీ షెడ్యూల్లో ఉన్న కూడా నన్ను బ్లెస్స్ చేయడానికి వచ్చారు వారికి నా ధన్యవాదాలు. బెల్లంకొండ సురేష్ గారు 

బుచ్చిబాబు గారు,సుబ్బు గారు ఇలాఇలా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను నేను రాసుకున్న కంటెంట్ ను అనుకున్నది అనుకున్నట్లు చేయడం జరిగింది దానికి కారణం 

కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎడిటర్ బసవ రెడ్డి గారు, భీమ్స్ వీరు ముగ్గురు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు .ట్రైలర్ చూస్తే యాక్షన్ ఫిల్మ్ గా అనిపిస్తుంది కానీ ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మేము చాలా విషయాలు రివీల్ చెయ్య కూడదు కాబట్టి మేము ట్రైలర్లో చూపించలేదు ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది అది ఏంది అన్నది సినిమా చూస్తే తెలుస్తోంది.అభినవ్ సర్దార్ చాలా చాలా అద్భుతంగా నటించాడు ఈ చిత్రంలోని విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి థియేటర్లో చూసిన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమాను ఓటిటి లో కాకుండా థియేటర్స్  లలో నవంబర్ 19న విడుదల చేయడానికి  చేస్తున్నామని అన్నారు.

 *చిత్ర హీరో, నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ మాట్లాడుతూ*..మధ్యతరగతి కుటుంబం నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను.వ్యవసాయం చేసే మా నాన్న ఎంతో కష్టపడి చదివించాడు.ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకు వచ్చాను అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా అన్నయ్యలు. మా పెద్దన్న లాల్, చిన్న అన్న డాక్టర్ జవహర్ లాల్వారు  నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సరైన దారిలో వెళ్లేలా తీసుకొచ్చి నన్ను నిల్చోబెట్టారు మా అన్నయ్యలు.నేను చిన్నప్పుడు చేయాలనుకున్న కలలను నిజం చేసుకోవాలి అనుకొని కష్టపడుతూ ఆ కలలను నెరవేర్చుకుంటూ వస్తున్నాను.ఈ రోజు వరకు కూడా నేను ఏం చేస్తున్నా మా అన్నలకు నామీద ఫుల్ కాన్ఫిడెన్స్.నేను ఏం చేసినా పదిమందికి ఉపయోగపడే  పని చేస్తాను. నేను సంపాదించిన దాంట్లో 10% కాంట్రిబ్యూట్ చేస్తాను.దీనికి సపోర్ట్ గా నా ఫ్రెండ్స్ శ్రీధర్, విశ్వ, వాసు 

నేను ఏమి యాక్టివిటీ చేసిన నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు.లైఫ్ లో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి.వాటిని నిజం చేసుకోవాలంటే మనం 100% డెడికేషన్ తో పని చేయాలి దాంట్లో ఫెయిల్ అయిన పర్వాలేదు గానీ ట్రై చేయాలి.అలా చేస్తే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. 

ఈ సినిమా విషయానికి వస్తే  ఇంతముందు సినిమాల్లాగా ఈ సినిమా ఉండదు. జనరల్ గా వస్తున్న సినిమాలన్నీ కూడా లవ్ స్టొరీ ని యాక్షన్ స్టోరీలలో వుండే కథనే బేస్ గా తీసుకొని న్యూ ప్యాకేజ్డ్ సినిమా తీస్తారు. అయితే అట్టి సినిమాలు చూస్తున్నపుడు అందులోని  సీన్స్ వచ్చినపుడు వేరే సినిమాలో ఈ సీన్స్, కథను కాపీ చేశారు అని అంటుంటారు.అయితే ఈ చిత్రంలోని కంటెంట్ మాత్రం ఏ సినిమాకు కాపీ గా ఉండదు. ఇందులో ఉన్న పాయింట్ ను ఇప్పటివరకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోగానీ ఎవరు టచ్ చేయలేదు.కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది.ఈ కాన్సెప్ట్ ని డిఫరెంట్ వేలో తీసుకొని చూపించడం జరిగింది ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కి ఖచ్చితంగా నచ్చుతుంది. నా  క్లోజ్ ఫ్రెండ్ షానీ ద్వారా దర్శకుడు వెంకటేష్ ని పరిచయం చేసి మంచి కాన్సెప్ట్ వినిపించాడు.చిన్న బడ్జెట్ అని మొదలు పెట్టి ఓటిటి లో మరియు యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాము. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో మేము అనుకున్న బడ్జెట్ కి 100 టైమ్స్ పెరిగింది. సినిమా బడ్జెట్ పెరగడంతో నా సైనిక్ స్కూల్ బ్యాచ్ మేట్స్ కు  ఫోన్ చేసి నేను చేసే సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వుంటూ మాకు సపోర్టు చేయమంటే ముందుకు వచ్చారు. అలాగే నా ఫ్రెండు నిధి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది.ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాను మేము అనుకున్న  టార్గెట్ సెగ్మెంట్లలో  మొత్తం అందరికీ  మాస్, క్లాస్, యూత్ అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలని బిగ్  స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అని ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.మా సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా మౌత్ టాక్ తో పదిమందికి చెప్పి మా సినిమాను గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

 *సహ నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ* ..కరోనా టైంలో మేమంతా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలని ప్లాన్ చేశాము. డీఫ్రెంట్ గా కొత్త కథతో క్వాలిటీ లో ఎక్కడా తగ్గకుండా ఉండాలని చేసిన మాకు మేము అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. మొదటగా ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయాలనుకున్నాం. అయితే మా సినిమా పూర్తి  అవుట్ పుట్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కి, శ్రేయోభిలాషు లకు ఈ సినిమా చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఉన్న పాయింట్ గాని, కాన్సెప్ట్ గాని కొత్తగా ఉందని ఈ సినిమాను ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో విడుదల చేస్తే బాగుంటుందని అందరూ సజెస్ట్ చేశారు.అయితే మేము బడ్జెట్ కంటే ఎక్కువ ఇస్తామని ఓటిటి నుండి ఆఫర్ వచ్చినా మా ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు సలహా మేరకు మేము ధైర్యం చేసి మా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలను కున్నాం. మారుతి గారు నాకు మంచి ఫ్రెండ్ మా జర్నీ 23 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఫస్ట్ టైం  ఒక ఫ్రెండ్ గా మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చారు వారికి నా ధన్యవాదాలు. హీరో సర్దార్ కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ నిస్తుంది. ఎందుకంటే ఆయన నటన గాని సినిమాలో  లుక్కు చాలా బాగుంది. హీరోయిన్ చాందిని చాలా సంవత్సరాలు గా మాతో ట్రావెల్ అవుతుంది. తమిళ్ లో నటిస్తున్న తనకు తెలుగులో కూడా మంచి పేరు రావాలి.తను ఈ చిత్రంలో చాలా బాగా నటించింది.మేము అనుకున్న దానికన్నా చాలా చక్కగా తీశాడు దర్శకుడు వెంకటేష్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ బ్యానర్ లో మేము తీస్తున్న మొదటి ప్రాజెక్టు "రామ్ అసుర" ను ఈనెల 19న కార్తీక పౌర్ణమి రోజున మా సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందరూ మా సినిమాను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 

 *నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ* .. అభినవ్ నాకు మంచి ఫ్రెండ్ తనకున్న బిజినెస్ లలో సక్సెస్ సాధించాడు. తను ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా సక్సెస్ అయ్యాడు."రామ్ అసుర్" టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 

 *ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ..* ఈ సినిమా

ట్రైలర్ , టీజర్ చాలా బాగున్నాయి వెంకీ గారు సినిమాను చాలా బాగా తీశాడు ఇప్పటి వరకూ ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు 

 *కెమెరామెన్ J ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ** ..దర్శకుడు వెంకటేష్ ఒక మంచి సబ్జెక్ట్ ని ఎన్నుకున్నాడు పీనట్ డైమండ్

Ram Asur Pre Release event:

Ram Asur Pre Release event

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement