Advertisementt

ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్

Sat 06th Nov 2021 02:06 PM
pakka commercial,gopichand,maruthi,pakka commercial glimpse  ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్
Glimpse of Gopichand Pakka Commercial ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్
Advertisement
Ads by CJ

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా స‌క్సెస్ ఫుల్ నిర్మాత బ‌న్నీవాసు, స్టార్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్. గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఉత్కంఠ ఏర్ప‌డింది. ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ ఫ‌స్ట్ లుక్ తో పాటు చిత్ర బృందం విడుద‌ల చేసిన త‌దిత‌ర ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్స్ కి క్రేజీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా పక్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ విడుదద‌లై సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాదాపుగా 2 మిలియ‌న్ల వ్యూస్ ప్రేక్ష‌కుల ద్వారా అందుకోని ఈ గ్లిమ్స్ న‌వంబర్ 8న రాబోతున్న ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అంచ‌నాలు పెరిగేలా చేసింది.

 జీఏ2 పిక్చర్స్ - యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నాయి. ఈ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి కాంబినేష‌న్ లో రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి. ఇటు యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఇటు జీఏ2 పిక్చ‌ర్స్ నుంచి బ‌న్నీ వాసు వెరసీ ఈ స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌ల నిర్మాణ సార‌థ్యంలో ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా రూపొందుతోంది. ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వింద‌ర్ ఈ చిత్రానికి అద్భుమైన ఆర్ట్ వర్క్ ని అందించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్, ఎడిటిర్ ఎస్ బి ఉద్భ‌వ్, ఎస్ కే ఎన్ స‌హ నిర్మాత‌, లైన్ ప్రొడ్యూస‌ర్ బాబు, ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స‌త్య‌గమిడి

Glimpse of Gopichand Pakka Commercial:

Rousing response to glimpse of Gopichand Pakka Commercial

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ