Advertisementt

సితార ఎంటర్ టైన్మెంట్స్ తామర

Sat 06th Nov 2021 02:02 PM
sithara entertainments,international film,tamara,directed by ravi k chandran  సితార ఎంటర్ టైన్మెంట్స్  తామర
Sithara Entertainments announce an international film Tamara సితార ఎంటర్ టైన్మెంట్స్ తామర
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. తామర పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల భీమ్లా నాయక్ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న ఈ తామర చిత్రం కథ కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మించిన జెర్సీ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్రం నిర్మాణం ప్రకటన సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ. 

Sithara Entertainments announce an international film Tamara:

Sithara Entertainments announce an international film Tamara, to be directed by ace lensman Ravi K Chandran

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ