Advertisementt

ఏవమ్ జగత్ టీజర్

Fri 05th Nov 2021 08:45 PM
aevum jagat,aevum jagat movie,aevum jagat telugu teaser  ఏవమ్ జగత్ టీజర్
Aevum Jagat Teaser ఏవమ్ జగత్ టీజర్
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు దేవాకట్టా చేతుల మీదుగా విడుదలైన ఏవమ్ జగత్ టీజర్..!

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం "ఏవమ్ జగత్". దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని  రాధాస్ లవ్ అనే సాంగ్ విడుదల కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ పాట.  తాజాగా ఈ సినిమా టీజర్ ను  ప్రముఖ దర్శకుడు దేవాకట్టా విడుదల చేశాడు.

దర్శకుడు టీజర్ తోనే సినిమా పై క్యూరియాసిటీ పెంచాడు. డైలాగ్స్ తో ఒక్కసారిగా సినిమా రేంజ్ పెరిగిందని చెప్పాలి. టీజర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపచేసేలా ఉంది. టీజర్ లోని డైలాగ్స్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా లోని డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటీనటులు కూడా ఎంతో ఇంటెన్స్ తో కూడిన నటన ను కనపరిచినట్లు టీజర్ ను బట్టి తెలుస్తుంది. దర్శకుడు నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఛాయాగ్రహణం చాలా బ్యూటీ ఫుల్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దం గా ఉంది .ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

నటీనటులు - కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు

ఈ చిత్రానికి సంగీతం - శివ కుమార్, సినిమాటోగ్రఫీ - వెంకీ అల్ల, ఎడిటింగ్ - నిశాంత్ చిటుమోతు, ఆర్ట్ - సదా వంశి, ప్రొడక్షన్ మేనేజర్ - అభినవ్  అవునూరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - మోహన్ కృష్ణ, సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల, క్వాలిటీ హెడ్ : సిద్దార్థ కండల, నిర్మాతలు - ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్, రచన దర్శకత్వం - దినేష్ నర్రా, పిఆర్ ఓ : సాయి సతీష్, రాంబాబు పర్వతనేని.

Aevum Jagat Teaser:

Aevum Jagat Teaser Launchd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ