Advertisementt

టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్

Thu 04th Nov 2021 05:17 PM
taxi,taxi movie,taxi movie first look  టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్
Taxi movie first look టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్
Advertisement
Ads by CJ

దీపావళి సందర్భంగా టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత.. మొదలగు వారు ప్రధాన పాత్రల్లో హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జ (ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ట్యాక్సీ. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్ (M.Tech) సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నీ దీపావళి సందర్భంగా విడుదల చేశారు.

వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని తెలిపారు.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. లవ్ స్టొరీ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మార్క్ రాబిన్, సినిమాటోగ్రఫీ: ఉరుకుండారెడ్డి, వి ఎఫ్ ఎక్స్: ఆనంద్ పల్లకి, ఎడిటర్: టి.సి.ప్రసన్న, పీఆర్ ఓ: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని.

Taxi movie first look:

Taxi movie first look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ