Advertisementt

రామ్ చరణ్ RC15 తొలి షెడ్యూల్ పూర్తి

Wed 03rd Nov 2021 05:07 PM
rc15,ram charan,rc15 first schedule wrapped  రామ్ చరణ్ RC15  తొలి షెడ్యూల్ పూర్తి
RC15 first schedule wrapped రామ్ చరణ్ RC15 తొలి షెడ్యూల్ పూర్తి
Advertisement
Ads by CJ

మెగాపవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ పూర్త‌య్యింది. రీసెంట్‌గా స్టార్ట్ చేసి ముందుగా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. 

పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. శంకర్ అన‌గానే భారీత‌నం ఉన్న సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. గ్రాండ్‌గా చిత్రీక‌రించిన‌ సన్నివేశాలు సినిమాలో వ‌న్ ఆఫ్ ది హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. సినిమా కాస్ట్ అండ్ క్రూను డైరెక్ట‌ర్ శంక‌ర్ ముందుకు న‌డిపిన విధానం, ఔట్‌పుట్‌పై మేక‌ర్స్ హ్య‌పీగా ఉన్నారు. 

మూవీలో స‌రికొత్త పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను శంక‌ర్ స‌రికొత్త రీతిలో ప్రెజంట్ చేయ‌బోతున్నారు. ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు మెగాభిమానుల అంచనాల‌ను మించి సినిమా ఉంటుంది. కొర‌టాల శివ‌ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోక‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత‌ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్ర‌మిది. 

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్ర‌మిది. అలాగే శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ ఇది. త‌న బ్యాన‌ర్‌లో మ‌రే సినిమాకు పెట్ట‌నంత భారీ బ‌డ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో ఇండియ‌న్ సినిమాల్లోనే ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప‌లు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కియారా అద్వానీ, జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. 

మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో పాట‌ల‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత  శ్రీరామ్ రాస్తుండ‌గా మాట‌ల‌ను సాయి మాధ‌వ్ బుర్రా రాస్తున్నారు. తిరు సినిమాటోగ్ర‌ఫీ, అన్బ‌రివు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రూపొందిస్తున్నారు. 

RC15 first schedule wrapped:

Ram Charan RC15 first schedule wrapped

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ