Advertisementt

రజినీకాంత్ పెద్దన్న నుంచి రా సామీ.. సాంగ్

Thu 28th Oct 2021 08:32 PM
raa saami song,superstar rajinikanth,siva,asian infra estates llp,peddhanna movie  రజినీకాంత్ పెద్దన్న నుంచి రా సామీ.. సాంగ్
Raa Saami Song From Superstar Rajinikanth Peddhanna Out రజినీకాంత్ పెద్దన్న నుంచి రా సామీ.. సాంగ్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన పెద్దన్న ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ మోడ్‌లో రజినీని చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్‌లా అనిపించింది.

ఇక నేడు రా సామీ అంటూ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఉంది. ఇందులో రజినీ పాత్ర తీరును వివరించారు.

డి ఇమ్మాన్ సంగీతం అందించిన  ఈ పాట ఫుల్ ఎనర్జీతో ఉంది. ముఖేష్, అతని బృందం అద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్ తన స్టైల్లో మాస్ యాంగిల్‌లో  ఈ పాటను రాసేశారు. రజినీకాంత్ పాత్ర గురించి వివరిస్తూ అద్భుతంగా రాశారు.

పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న భారీగా విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.

ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. నయన తార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Raa Saami Song From Superstar Rajinikanth Peddhanna Out:

Lyrical Video of Raa Saami Song From Superstar Rajinikanth, Siva, Asian Infra Estates LLP Peddhanna Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ