Advertisementt

సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ద్వారా పుష్పక విమానం

Wed 27th Oct 2021 03:47 PM
ananad devarakonda,deverakonda brothers,vijay deverakonda,pushpaka vimanam movie,pushpaka vimanam worldwide distributors revealed  సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ద్వారా పుష్పక విమానం
Pushpaka Vimanam worldwide distributors revealed సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ద్వారా పుష్పక విమానం
Advertisement
Ads by CJ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పుష్పక విమానం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 

ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా పుష్పక విమానం సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న పుష్పక విమానం ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ పుష్పక విమానం  సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది. 

పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. 

 

Pushpaka Vimanam worldwide distributors revealed:

Ananad Devarakonda Pushpaka Vimanam worldwide distributors revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ