Advertisementt

మంచి రోజులు వచ్చాయి టైటిల్ సాంగ్‌

Tue 26th Oct 2021 12:10 PM
manchi rojulochaie,maruthi manchi rojulochaie,manchi rojulochaie title song,santosh sobhan,mehreen kaur pirzada  మంచి రోజులు వచ్చాయి టైటిల్ సాంగ్‌
Manchi Rojulochaie title song out మంచి రోజులు వచ్చాయి టైటిల్ సాంగ్‌
Advertisement
Ads by CJ

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, ట్రైలర్,  అలానే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వ‌ర‌ప‌రిచిన సోసోగా ఉన్నా, ఎక్కేసిందే పాటలకు  అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ పాట సాగింది. మంచి రోజులు వచ్చాయి అంటూ సాగే లిరిక్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తుంది. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. 

అలాగే అజయ్ ఘోష్ కూడా ఈ పాటలో హైలైట్ అయ్యారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Manchi Rojulochaie title song out:

Maruthi Manchi Rojulochaie title song 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ