Advertisementt

భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో గంధర్వ

Mon 25th Oct 2021 05:02 PM
gandharva,gandharva movie,gandharva telugu movie,sandeep madhav,gayathri r suresh,sheetal bhatt,sai kumar,suresh,mn madhu  భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో గంధర్వ
Gandharva movie climax భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో గంధర్వ
Advertisement
Ads by CJ

భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో గంధర్వ మూవీ

వంగవీటి, జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం గంధర్వ. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక పాయింట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తో అప్సర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్, బాబు మోహన్ వంటి వారు ఈ చిత్రంలో  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ లకు మంచి స్పందన లభించడమే కాకుండా సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి.   

ఇండియ‌న్ సినిమాల్లో ఇప్పటివరకు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతుండగా.. ఇప్ప‌టి వరకు చేయని ఓ వైవిధ్యమైన రోల్‌లో హీరో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ఇది వరకే చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులు సాయి కుమార్, సురేష్ లతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారు. తమ ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు  హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఈ సినిమా కోసం పనిచేసిన వారంతా ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

న‌టీన‌టులు: సందీప్ మాధ‌వ్‌, గాయ‌త్రి ఆర్‌.సురేశ్‌, శీత‌ల్ భ‌ట్‌, సాయికుమార్‌, సురేష్ త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం: క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అప్స‌ర్, ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.మ‌ధు, బ్యాన‌ర్స్‌: ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సంగీతం: ర్యాప్ రాక్ ష‌కీల్‌, సినిమాటోగ్ర‌ఫీ: నిరంజ‌న్ జె.రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగు.వై, ఆర్ట్‌: జె.కె.మూర్తి, ఎడిట‌ర్‌: బ‌స్వా పైడి రెడ్డి, ఛీఫ్ కో-డైరెక్టర్: ప్రకాష్ పచ్చల, పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, అప్స‌ర్‌, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్, పర్వతనేని రాంబాబు.

Gandharva movie climax:

Gandharva movie with huge climax action sequence

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ