Advertisementt

కిరణ్ అబ్బవరం సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్

Thu 21st Oct 2021 02:31 PM
kirana abbavaram,sammathame movie,kirana abbavaram sammathame,sammathame first glimpse released  కిరణ్ అబ్బవరం సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్
Sammathame first glimpse released కిరణ్ అబ్బవరం సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. మెద‌టి చిత్రం రాజా వారు రాణి గారు రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతోన్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా  ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్  చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది.

పాటలతో ఎదుటివారి  ఫీలింగ్స్‌ను బయటపెట్టడంతో ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ వస్తోంది. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. సతీష్ రెడ్డి మాసం సినిమాగ్ర‌ఫి, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి.

Sammathame first glimpse released:

Kirana Abbavaram Sammathame first glimpse released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ