Advertisementt

శాంతి కుమార్ తుర్లపాటి నాతో నేను

Sat 16th Oct 2021 06:50 PM
natho nenu movie,director santhi kumar tanguturi,sai kumar,adi sai kumar  శాంతి కుమార్ తుర్లపాటి నాతో నేను
Natho Nenu new Movie Opening శాంతి కుమార్ తుర్లపాటి నాతో నేను
Advertisement
Ads by CJ

సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన నాతో నేను.

ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్,రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం నాతో నేను విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్,సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ఈ పూజ కార్యక్రమాన్ని విజయ్ చందర్ గారు జ్యోతి ప్రజ్వలన  చేయగా, ఫ్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ ను అందించారు. హీరో హీరోయిన్ల పై జరిగిన తొలి ముహూర్తపు సన్నివేశానికి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ నిచ్చారు, లవ్లీ హీరో ఆది సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ.. మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయి నుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను అంటే దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. శాంతి కుమార్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తికి నేను ఏంతో ఋణపడి ఉన్నాను వారికి నా ధన్యవాదాలు. ఈ చిత్ర  పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్ ను ఫ్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ గా ఫీల్ అవుతున్నాను. నటుడు విజయ్ చందర్, డైరెక్షన్ అనిల్ రావిపూడి ,మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గార్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నాతో నేను జర్నీ నిజంగా ఒక పాండమిక్ టైం లో ఒంటరిగా ఫీల్ అయి నటువంటి సిచ్చువేషన్ లో నా కనిపించిన ఒక సిచ్చువేషన్ ను కథగా తయారుచేసుకున్నాను.నేను చిన్నప్పటినుంచి రైటర్ ని ఒక మంచి కథ రాసుకొని సినిమా తీయాలను కొని మంచి కథ  రాసుకోవడం జరిగింది కరోనా వలన అందరూ లాక్డౌన్ ఉన్న టైంలో 8 నెలలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, డైలాగ్స్ తో సహా రాసుకున్నాను. ఈ కథ అద్భుతంగా వచ్చిన తర్వాత ఈ కథను ఎవరికి చెప్పాలి, ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నప్పుడు నంద్యాలలో ఒక ఈవెంట్ కు మిమిక్రీ ఆర్టిస్టుగా వెళ్ళినపుడు ఎల్లాలు బాబు గారికి ఈ కథ చెప్పడం జరిగింది.ఈ కథ చెప్పగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేము ఒక మంచి సినిమా తీయాలని మంచి కథ కోసం వెతుకుతున్నాము అని చెప్పడంతో నాకు చాలా సంతోషమేసింది.అలాగే ఈ కథకు మంచి క్యాస్ట్ & క్రూ కావాలి అనుకున్న టైం లో నాకు సాయికుమార్ గారు గుర్తుకు వచ్చారు.ఎందుకంటే నేను వారితో కర్ణాటకలో కొంత జర్నీ చేశాను. అయితే ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి హిట్ సినిమా చేసిన తర్వాత మా సినిమాను ఒప్పుకుంటాడా లేదా అని కొంచెం భయపడ్డాను. ఈ సినిమాలోని క్యారెక్టర్ కు తనైతే యాప్ట్ అని సార్ ను కలసి ఈ కథ చెప్పడం జరిగింది. తనకు ఈ కథ నచ్చి చేస్తానని చెప్పడంతో తనతో సినిమా చేయాలన్న  కోరిక ఈ చిత్రంతో తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు కశ్యప్ గారు మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. మేము కథ ఎంతబాగా రాసుకున్న సరైన  కెమరామేన్ లేకపోతే కష్టం. మాకు మంచి కెమెరామెన్ మురళి గారు లభించారు.మాకు మంచి హీరో,హీరోయిన్స్,టెక్నీషియన్స్ లభించడమే కాకా ఇందులో సీనియర్ నటి, నటులు చాలామంది ఉన్నారు. మంచి క్రూ తో విజయదశమి రోజు మొదలు పెట్టిన మా సినిమా మంచి విజయం సాధించాలని, దర్శకుడిగా ఇలాగే మంచి అవకాశాలు రావాలని  దేవున్ని, పెద్దలను మనస్ఫూర్తిగా  కోరుచున్నాను అన్నారు.

చిత్ర సమర్పకులు ఎల్లాలు బాబు టంగుటూరి మాట్లాడుతూ.. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ రోజు ఈ సినిమా తీస్తానని అనుకోలేదు నేను ఐదు సంవత్సరాల నుంచి సినిమా తీయాలనే ఆలోచన ఉంది కానీ నాకు శాంతికుమార్ రూపంల కథ చెప్పడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.దర్శకుడితో ఈ కథ పై గత ఆరు నెలలుగా వర్క్ చేసి ఈ రోజు పూజ కార్యాక్రమాలతో సినిమాను మొదలు పెట్టాము. ఈ సినిమా ద్వారా మా కొడుకు ప్రశాంత్ ని పెద్ద నిర్మాతగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగింది అంటే దానికి కారణం సాయి కుమార్ గారి ప్రోత్సాహమే. ఈరోజు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు సినీ పెద్దలు అందరూ వచ్చి మా సినిమాను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ప్రశాంత్ ఫ్యూచర్ లో  బాగా కష్టపడి ఇలాగే మంచి సినిమాలు తీసి పెద్ద నిర్మాత గా ఎదగాలని కోరుతున్నాను అన్నారు.

వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ విజయదశమి పర్వదినాన మేము మొదటిసారి ఈ సినిమా రంగంలో అడుగు పెడుతున్నాం. ప్రశాంత్ సామాజికంగా మంచి మంచి సినిమాలు తీసి ఎదగాలని కోరుతున్నాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా మా మనవడు భవనీష్ అరంగేట్రం చేయడం చాలా సంతోషం. ఫీచర్లో తను మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నారు.

నిర్మాత ప్రశాంత్ టంగుటూరి మాట్లాడుతూ.. .ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో నాతో నేను సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో తీస్తున్న మా చిత్రానికి మురళి మోహన్ గారు డిఓపి గా సత్య కశ్యప్ మ్యూజిక్ ఇలా అందరూ అద్భుతమైన సాంకేతిక నిపుణులతో మంచి నటీనటులతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ ..ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నా కుమారుడు అది హీరోగా సినిమా ఓపెనింగ్ కు నేను వెళ్లి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే. నేను చేస్తున్న ఈ సినిమాకు తను వచ్చి కెమెరా స్విచ్చాన్ చేయడం జరిగింది. నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు.అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో నేను సినిమాలో ఈ విజయదశమి రోజు నా జర్నీ స్టార్ట్ అవుతుంది అనే డైలాగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ కూడా మంచి కథలు బేస్ చేసుకొని చేస్తున్నాను. డిఫరెంట్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నాను. ఈ ప్రాసెస్ లో నాకు శాంతి  కుమార్ ఫోన్ చేసి ఈ సినిమా కథ చెప్తాను అన్నాడు. అయితే తను చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్టు, ఆయన చేసే మిమిక్రీ ని నేను ఎంతో అభిమానిస్తాను. తను డైరెక్టర్ అవుతున్నాడా అనుకొని రమ్మన్నాను. తను మంచి కథతో కథనంతో ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి నాకు కథ చెప్పడంతో నేను చాలా ఎగ్జైట్ అయ్యాను కథ నాకు అంత బాగా నచ్చింది. ఈ సినిమాకు మంచి నిర్మాతలు దొరికారు. మంచి టెక్నీషియన్స్ మంచి క్యాస్టింగ్ కూడా సెట్ అయ్యింది. ఈ కథకు నేషనల్ అవార్డు కూడా వచ్చేటటు వంటి మంచి స్క్రిప్టు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అందరూ ఈ టైటిల్ బాగుందని మెచ్చుకుంటున్నారు. టైటిల్ తగ్గట్టు కథ ఉన్నందుకు ఈ సినిమా గొప్ప విజయం సాదించడమే కాక ఈ సినిమా ద్వారా నిర్మాతలు నంద్యాల కి మంచి గుర్తింపు తీసుకు వస్తారని అన్నారు.

చిత్ర హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాయి కుమార్ గారిని చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన సినిమాలకు ప్రత్యేకంగా ఉంటాయి. మార్కెట్ కి సంబంధం లేకుండా ఆయన చేసే సినిమాలు అందరికి ఒక ఎగ్జాంపుల్. ఆయన వాయిస్ పరంగా, యాక్టింగ్ పరంగా తను ఒక స్పెషల్. అలాంటి ఆయనతో నేను ఈ సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమా లైఫ్ లాంగ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆవ్వాలని కోరుతున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ.. సాయి కుమార్ గారిలాంటి ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ తో పని చేయడం అనేది నాకు చాలా బెస్ట్ థింగ్. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి.ఇవ్వన్నీ  బాగా రాశాడు శాంతి కుమార్.ఇందులో అందరూ కూడా పెద్ద పెద్ద సింగర్స్ పాడుతున్నారు మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు.

నటీనటులు: సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, విజయచందర్, ఎం ఎస్ చౌదరి, భద్రం, రాకెట్ రాఘవ, సుమన్ శెట్టి, మైమ్ మధు, షేకింగ్ శేషు, కే ఏ పాల్ రాము, రుద్ర అక్కులూరు, నాగిరెడ్డి, రవి, అశోక్, ఆకెళ్ల, జి.ఎం.ఆర్, రితికా చక్రవర్తి, శిరీష, పైమా, హంసా, ఏంజెల్ నయినా, అమ్ములు, మాధురి,శృతి, భువన, తాక్ష్వి తదితరులు.

సాంకేతిక నిపుణులు: సమర్పణ: ఎల్లాలు బాబు టంగుటూరి, బ్యానర్: శ్రీ భవనీష్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్: ప్రశాంత్ టంగుటూరి, పి ఆర్ ఓ: తేజస్వి సజ్జ, కథ, మాటలు, పాటలు స్క్రీన్ప్లే, దర్శకత్వం: శాంతి కుమార్ తుర్లపాటి.

Natho Nenu new Movie Opening:

Natho Nenu Movie Director Santhi kumar Tanguturi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ