Advertisementt

నిర్మాతగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

Mon 11th Oct 2021 07:13 PM
dharmapuri movie,choreographer shekhar master,dharmapuri cinema  నిర్మాతగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్
Choreographer Shekhar Master as producer నిర్మాతగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్
Advertisement
Ads by CJ

ధర్మపురి సినిమాతో నిర్మాతగా మారుతున్న స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్..

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వజగత్. ఆ ఊరి ఘడి లో సర్పంచ్ దగ్గర పని చేసే ఓ జీతగాడు.. బీడీ ఖార్ఖనా లో పనిచేస్తూ బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి చిత్రం. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించారు చిత్రయూనిట్. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు. ఓషో వెంకట్ సంగీతం అందించిన ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు: గగన్ విహారి, అపర్ణ దేవి, నాగమహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..

టెక్నికల్ టీమ్: రచన, దర్శకత్వం: విశ్వజగత్, సమర్పణ: శేఖర్ మాస్టర్, బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి, ఎడిటర్: మార్తాండ్ కే, వెంకటేష్, కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్, సంగీతం: ఓషో వెంకట్, PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Choreographer Shekhar Master as producer:

Choreographer Shekhar Master producer with Dharmapuri Cinema 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ