నిర్మాత యలమంచల రవిచంద్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది, 2010 లో పైరసీ పై నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా నాకు సంఘీ భావం ప్రకటించింది, కరోనా టైం లో అందరూ తీవ్రంగా నష్ట పోయి వుంటే ఇండస్ట్రీలో బాధాకర మైన సంఘటనలు జరుగుతున్నాయి, అందరూ కరెక్ట్ గా వుండి ఐకమత్యంగా కలసి వుంటే ఇండస్ట్ర కి మంచిది-పోసాని కృష్ణమురళి ఇంటి పై దాడిని అందరూ నిర్మాతలు ఖండించారు అని నట్టి కుమార్ చెప్పాడు, మా అందరి తరుపున చెప్పడానికి అతను ఎవ్వరూ, ఇండస్ట్రీకి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఇండస్ట్రీ కి అంటించవద్దు.
-పేర్ని నాని గారు సంక్షేమ పథకాలు కు ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పారు చాలా మంచి విషయం అలాగే సినీ పరిశ్రమ ను కూడా ఆదుకోవాలి, దయచేసి సిని ఇండస్ట్రీ నీ కాపాడండి..మాకున్న సమస్యలను పరిష్కరించండి అని ఏపి ప్రభుత్వన్ని వేడుకుంటున్నాను,ప్రస్తుతం ఇండస్ట్రీకి క్రమ శిక్షణ కావాలి, ఇండస్ట్రీ పెద్దల కు నా మనవి ఏమిటంటే ఒక సుప్రీం కమిటీ నీ ఏర్పాటు చెయ్యాలి, గిల్డ్, ఛాంబర్ లు కలసి ఒక తాటి పైకి రండి,ఛాంబర్ కౌన్సిల్ మా, ఫెడరేషన్ నుంచి ఒక సుప్రీం బాడీని ఏర్పాటు చెయ్యాలి.
-మా ఎన్నికలు నిలబడే మెంబెర్స్ కి తప్పితే ఎవరికి లాభం లేదు. కానీ ఇంత రచ్చ అవసరమా.
-ప్రకాష్ రాజ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. మా కూడా సస్పెండ్ చేసింది అలాగే తాను షూటింగ్ కి టైమ్ కి రాడు అని తనని సస్పెండ్ అయితే మీరు ఏమి పీక్కుంటారో పీక్కోండి అన్న వ్యక్తి మాటలు మీరు ఎలా మరిచి పోయి మద్దతు ఇస్తారు అని అడుగుతున్నా.
-బండ్ల గణేష్ ఎన్వలిడ్ అయ్యారు కానీ అతను దేవుడు సూచన మేరకు ఉపసంహరించు కున్నాను అని చెపుతున్నాడు, అది అంత అవాస్తవం.
-మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఇండస్ట్రీ కోసం, మా కోసం ఎంతో కొంత వాళ్ళు నిర్మాత గాను తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేసారు అందువల్ల వారికి మద్దతు తెలపటంలో ఎలాంటి సందేహం లేదు.
-కొంత మంది చేసిన వ్యాక్యాలు ఏపి ప్రభుత్వాన్ని హార్ట్ చేసి వుంటే క్షమించి సిని ఇండస్ట్రీ కి సపోర్ట్ చెయ్యండి, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ కి సహకరించాలి అని నా మనవి.
-ఇండస్ట్రీ లో 50వేల మంది బతుకుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ఏపి ప్రభుత్వం సహకరించాలి, నేను మొన్న ఏపిలో షూటింగ్ చేశాను చాలా చక్కగా సహకరించారు అక్కడ వాళ్ళు.
-సినిమా ఇండస్ట్రీ లో మా ఎలక్షన్స్ 900ల ఓట్లు కోసమే మనమే ఇంత రాజకీయం చేస్తున్నామే అలాంటిది రాజకీయ పార్టీ అని పేరుపెట్టుకున్న వాళ్ళు ఎంత రాజకీయం చేయాలి అసలు మనకి రాజకీయాలు ఎందుకు, ఎవరిని అయినా ఏదైనా సమస్య ఉంటె అడిగే విధానం బావుండాలి అలా కాకుండా ఎరా సన్నాసి ఇది చెయ్యి అంటె చేస్తారా అని మాట్లాడారు.
-మంత్రి పేర్ని నాని గారు మీరు స్మార్ట్ గా మాట్లాడారు కాని మా ప్రొడ్యూసర్స్ ముందు పెట్టుకొని అలా తిట్టటం అనేది బాలేదు సార్,రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ వేరు సార్,మీ రాజకీయాలు మీరు చేసుకోండి సార్ కాని అందులో మా ఇండస్ట్రీ ని వేరుగా చుడండి అని కోరుకుంటున్నాను.
-అన్ లైన్ సిస్టం వలన ట్రాన్స్ పరెన్సి వుంటుంది దీనికి నేను అంగీకరిస్తున్నాను కాని దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికి నచ్చితెనే ముందుకు వెళ్ళాలి.
-చివరిగా అందరికి నేను మనవి చేసేది ఏమిటీ అంటె అందరం కలిసి ఇండస్ట్రీ ని కాపాడుకుందాం అని కోరుకుంటున్నాను.