Advertisementt

లవ్ స్టోరి మ్యాజికల్ సక్సెస్ మీట్

Tue 28th Sep 2021 09:16 PM
love story movie,naga chaitanya,nagarjuna,sai pallavi,love story success celebrations,love story musical success celebrations  లవ్ స్టోరి మ్యాజికల్ సక్సెస్ మీట్
Love Story Musical Success Celebrations లవ్ స్టోరి మ్యాజికల్ సక్సెస్ మీట్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్ లు స్పెషల్ గెస్ట్ లుగా పాల్గొన్నారు

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ... 

మా సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్ గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు ఈ సినిమా ద్వారా. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసింది. ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరి తో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది. అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ...

అందరికీ నమస్కారం. చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ లవ్ స్టోరి మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తుంది. పాండమిక్ వల్ల లవ్ స్టోరి సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫ్రైడే మూవీస్ థియేటర్ లలో ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్ ఏంటి అనేది ఎప్పుడూ గమనిస్తుంటాను. పాండమిక్ వల్ల అది మిస్ అయ్యాను. కానీ ఈ నెల 24న ఆ మ్యాజిక్ డే నాకు వచ్చింది. రిలీజ్ చేస్తే థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం. కానీ మీరు వచ్చి చూస్తున్నారు. చాలా థాంక్స్. తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరి సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరి హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్ లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త సినిమా అయినా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. లవ్ స్టోరిని థియేటర్ లో ఎంజాయ్ చేయండి. అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...

లవ్ స్టోరి సినిమా సాధించిన విజయం నాకు చాలా రిలీవ్ ఇచ్చింది. జనరల్ గా నా సినిమాల సక్సెస్ గురించి టెన్షన్ పడను. కానీ లవ్ స్టోరి విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నా. రెండు సెన్సిటివ్ ఇష్యూస్ గురించి సినిమాలో చెప్పాం. దాన్ని కథలో చక్కగా రాయాలని అనుకున్నాం. మరో ఛాలెంజింగ్ విషయం పాండమిక్ టైమ్ లో థియేటర్ లకు జనం వస్తారా రారా అని భయపడ్డాం. ఆ భయాలన్నీ జయించి ఇవాళ విజయం సాధించాం. దేవుడు దీవించాడు. పైన మా నాన్నగారు ఆశీర్వదించారు అని నమ్ముతున్నాను.  ఇవాళ నిజంగా చాలా హ్యాపీ. లవ్ స్టోరి చాలా స్ట్రెస్ ఫుల్ జర్నీ. 3 ఏళ్లుగా సినిమాకు పనిచేస్తున్నాం. రెండు పాండమిక్ లు చూశాం. మా యూనిట్ కు థాంక్స్ తప్ప మరో మాట రావడం లేదు. నాగార్జున గారికి థాంక్స్. తన కొడుకు సినిమా అని కాదు ఆయన ఫిల్మ్ లవర్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇతర అతిథులకు కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసిన పిప్రీ ప్రజలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు, థియేటర్స్ ఓనర్స్ కు థాంక్స్. నా ఫ్యామిలీకి థాంక్స్. అన్నారు.

హీరో నాగార్జున మాట్లాడుతూ... 

తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు ఉన్న మిత్రులు, పెద్దలు నారాయణదాస్ నారంగ్ గారికి నమస్కారం. నాకు లవ్ స్టోరి సక్సెస్ మీట్ కన్నా ఇది హ్యూమానిటీ సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. మార్చి 2020 నుంచి పోరాడుతూనే ఉన్నా వైరస్ తో , ఏడాదిన్నర గడిచిపోయింది. ఒక వేవ్ లో బయటపడ్డాం అనుకున్నాం కానీ రెండో వేవ్ వచ్చి అణిచివేసింది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించాను. ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోంది. కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి. కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో బాగా పోరాడారు. కరోనాతో పోరాడి, కరెక్ట్ డెసిషన్స్ సరైన సమయంలో తీసుకుని ప్రజల్ని కాపాడారు. తెలంగాణ మీద కాస్త కనికరం చూపించింది, ఏపీలో ఉధృతి ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ ఆ వైరస్ నుంచి బయటపడ్డాం. ప్రజల్ని కాపాడటమే ప్రభుత్వాల పని. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవలేదు. తెలంగాణలో థియేటర్స్ తెరిచారు. ఏపీలో వైరస్ దృష్ట్యా పూర్తిగా తెరవలేదు. ఆరోగ్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రుల దాకా థాంక్స్ చెబుతున్నా. లవ్ స్టోరి సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది. లవ్ స్టోరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు. లవ్ స్టోరి ఒక నాంది. దసరా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చింది. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్ స్టోరి విజయం వల్ల సంబరాలు చేసుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. ఆయన పేరు పేరునా టీమ్ అందరినీ పిలిచారు. మేము మర్చిపోతాం. నీ మానవత్వం సూపర్బ్. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ అది సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేసి తీయాలి. శేకర్ కమ్ముల అది నేర్చుకున్నాడు. లవ్ స్టోరి ఊరికే హిట్ అవలేదు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. వన్ గర్ల్ ముందుకొచ్చి తన సమస్యను చెప్పగలిగితే చాలు లవ్ స్టోరి కి సార్థకత వచ్చినట్లే. సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో ఏవేవో వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని నిరూపించారు శేఖర్ కమ్ముల. క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్ట్ చేస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశారు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు. కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్. నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయాను. నారాయణ దాస్ నారంగ్ గారికి నాన్నగారు ఏఎన్నార్ తో చాలా అనుబంధం ఉండేది. మీరు నాతో సినిమా తీయకుండా చైతూతో సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాన్నను చూసినట్లే ఉంటుంది. సునీల్ నా ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డారు సినిమా రిలీజ్ డేట్ విషయంలో. కానీ మీరు కరెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను మిమ్మల్నందరినీ కంగ్రాట్స్ చేస్తున్నాను. పవన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను. అందుకే వందలాది మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెల్ డన్ పవన్. సుద్దాల సాహిత్యం, మంగ్లీ పాటలు పాడిన తీరు బ్యూటిఫుల్ గా ఉంది. సినిమాకు పనిచేసిన చాలా మంది గురించి మాట్లాడాలి. సాయి పల్లవి..మీ తాతగారికి అన్నమయ్య సినిమానే చూపిస్తూ ఉండు. సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్. పేరు పేరునా నటీనటులు, టీమ్ మెంబర్స్ అందరికీ గాడ్ బ్లెస్ యూ. లవ్ స్టోరి ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అప్పుడప్పుడూ వస్తుంటాయి. కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా...నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్ సినిమాలో. ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు  ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఇకపైనా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం మాస్క్ లు తీసేసి హాయిగా కలిసి ఉండాలని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. అన్నారు

love story movie,naga chaitanya,nagarjuna,sai pallavi,love story success celebrations,love story musical success celebrationslove story movie,naga chaitanya,nagarjuna,sai pallavi,love story success celebrations,love story musical success celebrations

Love Story Musical Success Celebrations:

Love Story Success Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ