Advertisementt

నాగశౌర్య లక్ష్య రిలీజ్ డేట్ ఫిక్స్

Mon 27th Sep 2021 05:26 PM
naga shaurya,lakshya movie,ketika sharma,jagapathi babu,sachin khedekar  నాగశౌర్య లక్ష్య రిలీజ్ డేట్ ఫిక్స్
Naga Shaurya LAKSHYA Release date fixed నాగశౌర్య లక్ష్య రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ ప్రామిసింగ్‌ హీరో నాగ శౌర్య  కెరీర్‌లో 20వ చిత్రంగా రూపొందుతోన్న లక్ష్య సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. ప‌తాకాల‌పై  నారాయణ్ కె నారంగ్, పుస్కూరు రామ్‌ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆదివారం ఈ మూవీ యూనిట్ లక్ష్య చిత్రం ఎప్పుడు విడుదల కాబోతోందని మీరు ఊహిస్తున్నారు? అంటూ నెటిజ‌న్ల‌కు ఓ పజిల్ ఇచ్చింది  ఆప్షన్‌లుగా నాలుగు తేదిల‌ను ఇచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నవంబర్ 12న విడుద‌ల‌కాబోతుంది.

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో షర్ట్ లేకుండా నాగ శౌర్య డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపించారు.  ఆయన హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ఇక కండలు తిరిగిన దేహంతో నాగ శౌర్య లుక్  వావ్ అనిపిస్తోంది. విలు విద్యలో ఆరితేరిన ఆటగాడిగా ఈ సినిమాలో నాగ‌శౌర్య ఇది వ‌ర‌కెన్న‌డూ చూడ‌ని లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతోన్నారు. సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం నాగ శౌర్య విలువిద్య‌లో  ప్రత్యేక శిక్షణ  తీసుకున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

Naga Shaurya LAKSHYA Release date fixed:

Naga Shaurya LAKSHYA to Release On November 12

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ