Advertisementt

డేట్ మార్చుకున్న ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

Sun 26th Sep 2021 02:45 PM
most eligible bachlelor,akhil,pooja hegde,most eligible bachlelor new release date  డేట్ మార్చుకున్న ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
Most Eligible Bachlelor changes its release plans డేట్ మార్చుకున్న ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం రిలీజ్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో అఖిల్, పూజా హెగ్డే చేతులు పట్టుకొని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

Most Eligible Bachlelor changes its release plans:

Most Eligible Bachlelor new release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ