Advertisementt

మహేష్ కోసం త్రివిక్రమ్ అప్పుడే..

Sat 25th Sep 2021 05:49 PM
trivikram,mahesh,mahesh-trivikram,sanjay dutt,pooja hegde,nabha natesh,s.radhakrishna  మహేష్ కోసం త్రివిక్రమ్ అప్పుడే..
Trivikram for Mahesh మహేష్ కోసం త్రివిక్రమ్ అప్పుడే..
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ త్వరగా ముగించేసి.. త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అవ్వాలనుకుంటున్నాడు. మరోపక్క మహేష్ యాడ్ షూట్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. పరశురామ్ తో సర్కారు వారి పాట షూటింగ్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఫినిష్ చెయ్యాలని మహేష్ చూస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉంది. ఇక దీని తర్వాత మహేష్ త్రివిక్రం తో మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ లో ఉన్నాడు. పవన్ తో భీమ్లా నాయక్ అవ్వగానే మహేష్ తో మూవీ స్టార్ట్ చేస్తారు త్రివిక్రమ్. ఇప్పటికే మహేష్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్..
హీరోయిన్ గా పూజ హెగ్డే ని, మ్యూజిక్ డైరెక్టర్ గ థమన్ ని ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయే SSMB28 కోసం త్రివిక్రమ్ ఓ ఇంటి సెట్ ని నిర్మిస్తున్నారట. ఈ ఇంటి సెట్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఆ ఇంటి సెట్ ని ఐదు కోట్ల రూపాయలతో భారీగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ ఈ సినిమాకి అవసరమైన విలాసవంతమైన ఇంటిని రూపోందిస్తున్నారట. ఈ కాస్ట్లీ ఇంటి సెట్ లోనే సినిమాలోని మేజర్ భాగం షూట్ చేయబోతున్నట్లుగా టాక్. ఈ సినిమాకి పార్ధు అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. మహేష్ - త్రివిక్రమ్ కాంబో.. రెగ్యులర్ షూట్ నవంబర్ నుండి కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి మొదలు పెట్టే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

Trivikram for Mahesh:

Mahesh-Trivikram going for extravaganza?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ